ఏపీలో ఎన్నికల షెడ్యూల్ పై సజ్జల క్లారిటీ..!!

ఏపీలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా. మార్చిలోనే ఎన్నికలంటూ సాగుతోన్న ప్రచారం పైన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టత ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయో తెలియదని…ఆ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి ఎలక్షన్స్ ఉంటాయని తేల్చి చెప్పారు. ఏపీలో జగన్..చంద్రబాబులో ఎవరు కావాలో ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. పవన్ కల్యాణ్ ను తాము లెక్కలోకి తీసుకోవటం లేదని తేల్చి చెప్పారు.

 

ఏపీలో ఎన్నికల షెడ్యూల్ పైన కొద్ది రోజులుగా పలు రకాల చర్చలు తెర మీదకు వస్తున్నాయి. వీటిపైన సజ్జల క్లారిటీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటుగానే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎన్నికలు ఎప్పుడు వ్చినా తాము సిద్దంగా ఉన్నామని వెల్లడించారు. అట్టడుగు వర్గాల రాజకీయ సాధికారత సాధించటమే సీఎం జగన్ లక్ష్యమని సజ్జల చెప్పుకొచ్చారు. ఆర్దిక వెనుకుబాటు తనం పోగొట్టాలన్నదే సీఎం జగన్ ఆలోచన అని స్పష్టం చేసారు. కాలం మారుతున్నప్పుడు మనం కూడా మారాలాన్నారు. భవిష్యత్ వైపు అడుగులు వేస్తున్న జగన్ కావాలా..లేక తాను ఇచ్చిన దాంతో సరిపెట్టుకోమే చంద్రబాబు కావాలా అనేది ఆలోచన చేయాలన్నారు.

 

ఎన్నికల సమయంలో చంద్రబాబు పది చేస్తానని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని నమ్మితేనే ఓట్లేమయనే నాయుడు జగన్ మాత్రమేనని పేర్కొన్నారు. ఇలాంటి వారిని రాజకీయాల్లో ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. అగ్రవర్ణాలతో పోటీ పడే స్థాయికి వచ్చేలా బీసీలకు జగన్ చేయూతనిస్తున్నారని సజ్జల వివరించారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు నోటికొచ్చిన హామీలు ఇస్తన్నారని సజ్జల విమర్శించారు. చంద్రబాబు 2014-19 కాలంలో ప్రజల కోసం ఎటువంటి నిర్ణయాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవటానికి వైసీపీ సిద్దంగా ఉందని సజ్జల తేల్చి చెప్పారు. ఎవరి కోసమే పని చేసే పవన్ ను తాము లెక్కలోకి తీసుకోవటం లేదని సజ్జల స్పష్టం చేసారు.

Posted Under AP
Editor