ప్రతీనెల 15వేలు.. మళ్లీ అడ్డంగా బుక్కైన నారా లోకేష్…

సుదీర్ఘ విరామం తర్వాత లోకేష్ పాదయాత్రను పునః ప్రారంభించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టుతో సెప్టెంబర్ తొమ్మిదిన రాజోలు నియోజకవర్గం లోకేష్ పాదయాత్రను నిలిపివేశారు. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించడంతో ఈనెల 27న ఆగినచోటే పాదయాత్రను పునః ప్రారంభించారు. ప్రస్తుతం గోదావరి జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ప్రతి నియోజకవర్గంలో భారీ సభలు ఏర్పాటు చేస్తున్నారు.

 

ఓ బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ అమ్మఒడి సాయం గురించి ప్రస్తావించారు. అమ్మఒడి సాయం లో జగన్ మాట తప్పారని ఆరోపణలు చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే.. అందరికీ పథకం వర్తింపజేస్తామన్న హామీని బుట్ట దాఖలు చేశారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ” ప్రతి నెల” రూ.15 వేలు అందిస్తామని.. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు.. ముగ్గురు పిల్లలు ఉంటే “రూ.90 వేలు” అందిస్తామని నోరు జారారు. ఏడాదికి బదులు నెలకు అని.. రూ.45 వేలకు బదులు రూ.90 వేలు అని చెప్పి అడ్డంగా బుక్కయ్యారు. దీంతో ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లోకేష్ మాట్లాడుతున్నారంటే ఇలాంటి ఆణిముత్యాలు జాలువారుతాయని నెటిజన్లు ఎదురు చూస్తూ ఉంటారు. వారు ఆశించినట్టే మాట్లాడి లోకేష్ వినోదం పంచుతుంటారు. అయితే లోకేష్ ఈ తరహా వ్యాఖ్యలపై టిడిపి శ్రేణులు సైతం అసహనం వ్యక్తం చేస్తుంటారు.

Posted Under AP
Editor