హాట్ కేకుల్లా సలార్ టికెట్స్ అమ్ముడుపోయాయి. ప్రీమియర్ బుకింగ్స్ తోనే సలార్ భారీ రికార్డు నమోదు చేసేలా కనిపించింది. అనూహ్యంగా సలార్ విడుదల ఆలస్యమైంది. దీంతో బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఇది ఒకింత నిరాశపరిచే అంశం. కొత్త విడుదల తేదీగా డిసెంబర్ 22 ప్రకటించారు. త్వరలో బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. కాగా సలార్ కి సంబంధించిన ఓ న్యూస్ గూస్ బంప్స్ కలిగిస్తుంది.
ఓ ఫైట్ కోసం ఏకంగా 750 వాహనాలు వాడుతున్నారట. జీప్స్, ట్రక్స్ , ట్యాంక్స్ భారీగా ఉపయోగించారట. దాదాపు రెండు దేశాల మధ్య యుద్దాన్ని తలపించేలా భారీ యాక్షన్ సీక్వెన్స్ రోపొందించారట. ఈ ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలవనుందట. హాలీవుడ్ సినిమాలకు మించి ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. సలార్ టీజర్ అంచనాలకు మించి ఉంది. ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ డైనోసార్ గా అభివర్ణించాడు.
కాగా షారుఖ్ ఖాన్ డంకీతో సలార్ పోటీపడుతోంది. దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన డంకీ డిసెంబర్ 21న విడుదల కానుంది. సలార్ 22న విడుదల చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది. జగపతిబాబు, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక రోల్స్ చేస్తున్నారు.
