బెంగళూరు/కారవార: కర్ణాటకలోని అనేక జిల్లాల్లో పర్యాటక కేంద్రాలు పుష్కలంగా ఉన్నాయి. బెంగళూరు (Bengaluru) నగరంతో పాటు కర్ణాటకలోని (Karnataka) ఇతర జిల్లాల్లోని పర్యాటక కేంద్రాల్లో హ్యాపీగా సంచరించి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి ఎంజాయ్ చెయ్యడానికి చాలామంది ప్లాన్ చేస్తుంటారు.
ఎక్కువ స్నేహితులతో కాలం గడపడానికి యువతి, యువకులు ప్లాన్ చేస్తుంటారు.
థాయ్ లాండ్ హనీమూన్ ఫోటోలు లీక్ చేస్తానని ?, ఐటీ హబ్ భార్యకు షాక్, ఏడాదికే సైకో సీన్!
బెంగళూరు (Bengaluru) సిటీలోని కార్పోరేట్ కంపెనీలు, ఐటీ కంపెనీల్లో (companies)ఉద్యోగం చేస్తున్న యువతి, యువకులు ఎక్కువగా కర్ణాటకలోని (Karnataka)ఇతర ప్రాంతాలు సంచరించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఉత్తర కన్నడ జిల్లా, దక్షిణ కన్నడ జిల్లా, మైసూరు, కొడుకు తదితర జిల్లాల్లో ఎక్కువగా సంచరించడానికి బెంగళూరులోని యువతి, యువకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.
ఊటి వెళ్లే వాళ్లు బెంగళూరులో (Bengaluru) చాలా మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటకలో (Karnataka) పర్యటించడానికి చాలా మంది వస్తుంటారు. ఇలాంటి పర్యటనలకు వస్తున్న యువతను (youth) టార్గెట్ చేస్తున్న కొందరు హైటెక్ వేశ్యవాటిక కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వ్యభిచారం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పక్కా సమాచారం ఆధారంగా దక్షిణ కన్నడ జిల్లా పోలీసులు కమటా తాలూకాలోని బడా గ్రామంలోని నెసరా బీచ్ రిసార్ట్‌పై (resort) పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు.
దక్షిణ కన్నడ జిల్లా హమ్మంబొద్దికి చెందిన నగేష్, మంజప్ప శెట్టి, కలబురగి జిల్లా జేవర్గికి చెందిన ఆరిఫ్ ముల్లా, హుసేనా సాబ్ అరెస్టు అయిన నిందితులు.ఈ సమయంలో ఇద్దరు మహిళలను రక్షించి రిసార్టులో 8 మొబైల్ ఫోన్లు, సీసీ కెమెరాలు (CCTV), డీవీఆర్, రిజిస్టర్ స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. తన స్వలాభం కోసం వివిధ ప్రాంతాల నుంచి మహిళలను పిలిపించి తన రిసార్ట్ భవనంలో వ్యభిచారం వంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ లైగింక దోపిడీకి గురిచేస్తున్నాడని కుమట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
