ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్. ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో ఎంతోకాలం నుంచి ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ కారును అధికారికంగా ఆవిష్కరించింది.
చైనాలో జరిగిన చెంగ్డూ మోటార్ షోలో ఈవీ5ను ప్రదర్శించింది. దీని పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మిడ్ సైజ్ ప్రీమియం ఈవీ కి ముందు భాగంలో టైగర్ నోస్ గ్రిల్, కింక్డ్ రేర్ బెల్ట్‌లైన్, ఆలాయ్ వీల్స్‌కు వస్తున్న యాంగ్యులర్ డిజైన్లు మంచి హైలైట్ అయ్యాయి. రేర్ వింగ్‌లో ఎయిరోడైనమిక్ ఎఫీషియెన్స్ మెరుగుపరిచే విధంగా డిజైన్ ఉండటం విశేషం. కేబిన్ లో డాష్‌బోర్డ్, స్టీరింగ్ వీల్, ఇన్ఫోటైన్మెంట్ కన్సోల్లు.. ఈవీ9తో పోలి ఉన్నాయి. స్టీరింగ్ వీల్ పై చాలా బటన్స్ ఉన్నాయి. వీటితో కారు ఫంక్షన్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.
ఈ మోడల్ ముందుగా చైనాలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత యూరోప్, అమెరికా మర్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఇండియాలో విడుదల చేసే విషయంలో కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. అంతర్జాతీయంగా స్కోడా ఎన్యాక్యూ, మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూబీ, ఫిస్కర్ ఓషన్ వంటి ఈవీలకు గట్టిపోటీనిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈవీ6, ఈవీ9తో కియా మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికిల్ పోర్ట్‌ఫోలియో ఇప్పటికే బలంగా ఉంది. ఈవీ5 రాకతో మరింత శక్తివంతంగా మారుతుంది.
ఇతర ఫీచర్స్, ధర వంటి వివరాలపై ప్రస్తుతం స్పష్టత లేదు. కియా మోటార్స్ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ మోడల్ పై వినియోగదారుల్లో చాలా కాలంగా ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందా అని ఈవీ లవర్స్ దీనికోసం ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ కనిపిస్తోంది. ప్రతిష్ఠాత్మక 2023 నార్త్ అమెరికన్ కార్, ట్రక్, యుటిలిటీ వెహికిల్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో లిమిటెడ్ ఎడిషన్ ను కంపెనీ తీసుకొచ్చింది.