Latest Posts

గవర్నర్​ vs రాష్ట్ర ప్రభుత్వం.. తమిళనాడులో వేడెక్కిన రాజకీయాలు!

గవర్నర్​ వర్సెస్​ రాష్ట్ర ప్రభుత్వం’.. ఈ మధ్య కాలంలో ఈ తరహా వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దిల్లీ నుంచి తెలంగాణ వరకు బీజేపీయేతర రాష్ట్రాల్లో ఇంచుమించు ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.

తమిళనాడులోనూ ఈ వ్యవహారం సర్వత్రా చర్చలకు దారితీస్తోంది. తాజాగా.. గవర్నర్​- ప్రభుత్వం మధ్య విభేదాలతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గవర్నర్​ రవి తీసుకున్న అనూహ్య నిర్ణయాన్ని డీఎంకే ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో తన నిర్ణయాన్ని గవర్నర్​ హోల్డ్​లో పెట్టినట్టు తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే..!

ఎంకే స్టాలిన్​ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వీ సెంథిల్​ బాలాజీపై గత కొన్ని రోజులుగా క్రిమనల్​ ఆరోపణలు వస్తున్నాయి. క్యాష్​ ఫర్​ జాబ్​ స్కామ్​లో ఆయన రెండు వారాల క్రితం జైలుకు కూడా వెళ్లారు. అయితే.. సెంథిల్​ని ఎంకే స్టాలిన్​ మంత్రిగా కొనసాగిస్తున్నారు. కానీ ఎలాంటి శాఖను కేటాయించలేదు.

ఇక గురువారం ఓ అనూహ్య ప్రకటన చేశారు గవర్నర్ ఆర్​ఎన్​ రవి​. సెంథిల్​ను కౌన్సిల్​ ఆఫ్​ మినిస్టర్స్​ నుంచి తొలగిస్తున్నట్టు వెల్లడించారు. గవర్నర్​లు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా అరుదు అని సమాచారం.

“సెంథిల్​ బాలాజీపై తీవ్రమైన క్రిమినల్​ ఆరోపణలు ఉన్నాయి. కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో.. ఆయన్ని కౌన్సిల్ ఆఫ్​ మినిస్టర్స్​ నుంచి వెంటనే తప్పిస్తూ గవర్నర్​ నిర్ణయం తీసుకున్నారు,​” అని రాజ్​ భవన్​ నుంచి ఓ ప్రకటన వెలువడింది.

 

గవర్నర్​ చర్యలను ఎంకే స్టాలిన్​ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయన చర్యలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకుంది.

MK Stalin latest news : “మంత్రులను తొలగించే అధికారం గవర్నర్​కు లేదు. మేము లీగల్​గా ముందుకెళతాము. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాము,” అని ఎంకే స్టాలిన్​ అన్నారు.

గవర్నర్​ చర్యలపై డీఎంకే నేతలు మండిపడుతున్నారు.

“గవర్నర్​ అసలు ఏమనుకుంటున్నారు? సెంథిల్​ను తప్పించే రాజ్యాంగ అధికార ఆయనకు ఉందా? రాజ్యాంగాన్ని ఆయన కించపరుస్తున్నారు. ఆయన ఓ కీలు బొమ్మలా పనిచేస్తున్నారు. పెద్దలు చేప్పింది చేస్తున్నారు. ఆయన ఇచ్చిన ఆర్డర్లకు సంబంధించిన పేపర్​ను చెత్తకుప్పలో పడేయాలి,” అని డీఎంకే నేతలు విమర్శిస్తున్నారు.

YES9 TV