Latest Posts

గోల్డ్ స్మగ్లింగ్ నిందితురాలు స్వప్నాకు షాక్ ఇచ్చిన హైకోర్టు, ఇలాంటి కేసుల్లో !

బెంగళూరు/కొచ్చి: కేరళలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్‌ను బెదిరించిన క్రిమినల్ కేసులో ఊహించని ట్విస్ట్‌ ఎదురైయ్యింది.

స్వప్న సురేశ్‌ను బెదిరించాడన్న ఆరోపణలు ఎదురంకొంటున్న విజేష్ పిళ్లైపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేసేందుకు బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన అనుమతిని కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది.

గతంలో మెజిస్ట్రేట్ సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకోలేదని, కాబట్టి తాజాగా విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేయాలని కర్ణాటక హైకోర్టు బెంచ్ ఆదేశించింది. తనపై నమోదు అయిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ విజేష్ పిళ్లై దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేసి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

 

భార్యను చంపేసి బాత్ రూమ్ లో పూడ్చి పెట్టాడు, వీడికి మ్యాటర్ తెలిసి !

పిటిషనర్ దాఖలు చేసిన దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు. ఫిర్యాదుదారు స్వప్నా సురేష్ గుర్తించలేని నేరం కోసం మేజిస్ట్రేట్ కోర్టు ముందు పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. పోలీసు అధికారి మేజిస్ట్రేట్ ముందు దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ కేసులో విచారణ కొనసాగించవచ్చని కర్ణాటక హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

అలాగే, నిబంధనల ప్రకారం పోలీస్ స్టేషన్ ఆఫీసర్ లేదా ఫిర్యాదుదారు విచారణ కోసం ఎవరో ఒకరు కోర్టును ఆశ్రయించి అనుమతి పొందవచ్చు అని కర్ణాటక హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసులు పెరుగుతున్నా కొందరు న్యాయమూర్తుల నిర్లక్ష్యపు వైఖరి కొనసాగుతోందని, అందుకే అలాంటి ఆదేశాలు ఇస్తున్నారని, కొన్నిసార్లు సరైన కారణం చెప్పకుండా కేవలం ఒక్క మాటలో ఉత్తర్వులు జారీ చేస్తారని కర్ణాటక హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

YES9 TV