కృతి శెట్టి ఉప్పెన సినిమాతో అందరికి డ్రీమ్ గర్ల్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.
ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఉప్పెన సినిమాతో కృతి శెట్టి క్రేజీ హీరోయిన్ గా మారింది.ఈ చిత్రం తర్వాత కృతి శెట్టికి అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్ మరియు మాచర్ల నియోజకవర్గం వంటి వరుస చిత్రాల్లో నటించింది.వీటిలో బంగార్రాజు మంచి విజయం సాధించింది. మిగిలిన చిత్రాలన్నీ కూడా నిరాశపరిచాయి. అలాగే సుధీర్ బాబు సరసన నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.
సుధీర్ బాబు సినిమాలో కృతి శెట్టి ఎంతో క్యూట్ గా ఉంది. అలాగే తన నటనతో కూడా ఎంతగానో మెప్పించింది. కానీ ఆ సినిమా కృతి కి అంత గా కలిసి రాలేదు. అలాగే ఎన్నో ఆశలు పెట్టుకున్న కస్టడీ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది.దీనితో కృతి శెట్టి కెరీర్ ఒక రకంగా సందేహం లో పడింది.ఎలాంటి సినిమాలు చేయాలో ఆమెకు అర్ధం కావడం లేదు. ఇప్పుడు కృతి శెట్టికి అదృష్టం కలిసి రావడం లేదు.గ్లామర్ పరంగా ఇప్పటికే కృతి శెట్టి యూత్ కి ఫేవరిట్ హీరోయిన్ గా మారింది తాజాగా కృతి శెట్టి చిరునవ్వులు చిందిస్తూ కిల్లింగ్ లుక్ తో రెచ్చగొట్టింది.చిరునవ్వుతో ఉన్న కృతి శెట్టి ని ఇలా చూసి కుర్రాళ్లు టెంప్ట్ అవుతున్నారు.. వరుసగా వస్తున్న అపజయాలకు తన అందంతో చెక్ పెట్టేందుకు మరిన్ని ఆఫర్స్ అందుకునేందుకు కృతి శెట్టి హాట్ లుక్ తో రెచ్చగొట్టింది.ఈ ఫొటోస్ లో కృతి శెట్టి ఎంతో క్యూట్ గా ఉంది.