నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈశాన్య భారతం వరకు విస్తరించాయి. ఏపీలోని రాయలసీమ మీదుగా కోస్తా జిల్లాలకు మరో నాలుగు రోజుల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ సమయంలో ఏపీలోని పలు జిల్లాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ రోజు, రేపు ఇదే పరిస్థితి కొనసాగనుంది. శనివారం అర్ద్రరాత్రి ఈదురు గాలులు వీచాయి. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న బిపర్జాయ్ తీవ్ర తుఫానుగా మారింది.
నైరుతి రుతుపవనాలు ఈశాన్య భారతంలోని అనేక ప్రాంతాలకు విస్తరించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 48 గంటల్లో కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు.గోవా..మహారాష్ట్ర..తమిళనాడుతో సహా ఇతర ప్రాంతాలకు వ్యాపించనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 17 లేదా 18 తేదీల్లో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ముందుగా రాయలసీమ ద్వారా కోస్తాజిల్లాలకు విస్తరించనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వడగాల్పులు వీస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పొడి గాలులతో ప్రజలు ఉడికిపోయారు. కోస్తా జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంది. పలు ప్రాంతాల్లో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రోజు, రేపు ఇదే పరిస్థితి కొనసాగుతుదని వాతావరణ శాఖ వెల్లడించింది.
తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అతి తీవ్ర తుఫాన్ బిపర్జాయ్ శనివారంరాత్రికి అసాధారణ తీవ్ర తుఫానుగా బలపడింది. ఈ క్రమంలో వాయువ్యంగా దిశ మార్చుకుని ఈ రోజు స్వల్పంగా బలహీనడపి అతి తీవ్ర తుఫాన్ గా మారనుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 15వ తేదీ వరకు అతి తీవ్రతుఫాన్ సముద్రంలో కొనసాగుతుందని వివరించింది.
