కేంద్ర కేబినెట్ లోకి ఏపీ బీజేపీ నేత – తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు మార్పు..!!

కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్దం అవుతోంది. సార్వత్రిక ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ పాలన..పార్టీలో మార్పుల దిశగా బీజేపీ అధినాయకత్వం కసరత్తు ముమ్మరం చేసింది.

కేంద్ర మంత్రుల్లో పలువురికి పార్టీ బాధ్యతలు అప్పగించనుంది.

ఈ సారి ప్రక్షాళణలో ఏపీ, తెలంగాణ నుంచి ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల మార్పు తప్పదని చెబుతున్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలను పరిగణలోకి తీసుకొని మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది.

 

కేంద్ర కేబినెట్ లో మార్పులు: వచ్చే ఎన్నికలకు పూర్తి సంసిద్దత దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. త్వరలో జరిగే తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు..లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అవసరమైన మార్పులకు సిద్దం అవుతోంది. ఎన్టీఏ ను మరిన్ని పార్టీలతో విస్తరించే ప్రక్రియ పైన ఆలోచన చేస్తోంది.

ప్రధాని మోదీ ఈ నెల 21న అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ టూర్ కు ముందు..లేదా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ముందుగానే కేంద్ర కేబినెట్ ప్రక్షాళనతో పాటుగా పార్టీ అధ్యక్షుల మార్పు నిర్ణయాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పలు రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల మార్పుకు నిర్ణయించినట్లు సమాచారం. అందులో ఏపీ ,తెలంగాణ ఉన్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఉన్న బండి సంజయ్ కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించే ప్రతిపాదనపై చర్చలు జరిగినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

YES9 TV