రాబోయే రోజుల్లో పంజాబ్, ఢిల్లీ, కేరళ వెళ్లడానికి మీరు ప్రయత్నాలు చేసుకుంటుంటే ఇది మీకు సంబంధించిన వార్తే. ఢిల్లీ నుంచి కేరళకు నడిచే పలు రైళ్ల షెడ్యూల్స్ ను మార్పు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
ఈ మార్పు జూన్ 10వ తేదీ నుంచి అక్టోబరు 31వ తేదీ వరకు వర్తిస్తుందని తెలిపింది.
* నెంబర్ 12617 – ఎర్నాకుళం జంక్షన్ – హజ్రత్ నిజాముద్దీన్ మంగళ లక్షద్వీప్ ఎక్స్‌ప్రెస్ సమయం మార్పు చేశారు. ఇకనుంచి ఇది ఎర్నాకుళంలో 10.10కి బయలుదేరుతుంది.
* నెంబరు 12618 – నిజాముద్దీన్ – ఎర్నాకుళం మంగళ లక్షద్వీప్ 10.25 గంటలకు ఎర్నాకుళం చేరుకుంటుంది.
* నెంబర్ 12431 తిరువనంతపురం సెంట్రల్ – హజ్రత్ నిజాముద్దీన్ ట్రై-వీక్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ తిరువనంతపురం నుంచి 14.40 గంటలకు బయలుదేరుతుంది. ఇంతకుముందు సమయానికన్నా 4.35 గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది.
* నెంబర్ – 12483 కొచ్చువేలి-అమృత్‌సర్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ 4 గంటల 20 నిమిషాల ముందు బయలుదేరుతుంది.
* నెంబర్ – 20923 తిరునెల్వేలి జంక్షన్ – గాంధీధామ్ జంక్షన్ వీక్లీ హమ్‌సఫర్ సూపర్‌ఫాస్ట్ 2 గంటల 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతుంది.
* నెంబర్ 12432 – హజ్రత్ నిజాముద్దీన్-తిరువనంతపురం సెంట్రల్ రాజధాని ఎక్స్‌ప్రెస్ దాని షెడ్యూల్ సమయానికన్నా 2 గంటల 15 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది. ఆది, మంగళ, బుధవారాల్లో తిరువనంతపురం సెంట్రల్‌కి 01.50 గంటలకు చేరుకుంటుంది.
* నెంబర్ 22149 – ఎర్నాకులం జంక్షన్ – పూణే జంక్షన్ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ సమయం మార్చారు. ఇది దాని షెడ్యూల్ సమయానికన్నా 3 గంటల ముందుగా బయలుదేరుతుంది. ఆది, శుక్రవారాల్లో ఎర్నాకులం జంక్షన్ నుంచి బయలుదేరుతుంది.
* నెంబర్ – 22655 ఎర్నాకులం జంక్షన్ – హజ్రత్ నిజాముద్దీన్ సూపర్ ఫాస్ట్ రైలు కూడా దాని షెడ్యూల్ సమయానికంటే 3 గంటల ముందు బయలుదేరుతుంది.
* నెంబర్ -12217 కొచ్చువేలి-చండీగఢ్ బై-వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ దాని షెడ్యూల్ సమయంకన్నా 4 గంటల 20 నిమిషాల ముందుగా బయలుదేరుతుంది. సోమ, శనివారాల్లో ఇది కొచువేలి నుంచి బయలుదేరుతుంది.
