పశ్చిమబెంగాల్‌కి చెందిన ఎంపీ భార్య తన పిల్లలతో దుబాయికి వెళ్లాలనుకోగా.. ఎయిర్‌పోర్ట్ లోని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.
ఈడీ కేసులో తన పేరు ఉన్న నేపథ్యంలో ఎంపీ భార్య అయినప్పటికీ దుబాయ్ వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీని సోమవారం కోల్‌కతా విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. తమ ఇద్దరు పిల్లలతో కలిసి దుబాయి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకోగా.. వెళ్లేందుకు ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. అయితే కొద్దిసేపటి వరకు అక్కడే వేచిఉన్న రుజిరా బెనర్జీ అధికారులు ఎంతకు అనుమతి ఇవ్వకపోవడంతో .. చివరకు పిల్లలతో కలిసి ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. దుబాయ్ వెళ్లడానికి రుజిరా బెనర్జీకి అనుమతి ఇవ్వని ఇమ్మిగ్రేషన్ అధికారులను టీఎంసీ వర్గాలు విమర్శిస్తున్నాయి.
