ఒడిశా రైలు ప్రమాదం పైన వందేభారత్ రూపకర్త సుధాన్షు మణి కీలక వ్యాఖ్యలు చేసారు. ఒడిశా రైలు ప్రమాదానికి కారణాల పైన విశ్లేషించారు. ఇప్పటికే ఈ ప్రమాదానికి కారణాల పైన రైల్వే నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక ఇచ్చింది.
సిగ్నల్ లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని వెల్లడించింది. కవచ్ వ్యవస్థ ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఈ నివేదిక..ప్రమాదం పైన స్పందించిన సుధాన్షు మణి కవచ్ ఉన్నా కాపాడేది కాదన్నారు.
ప్రమాదంపై ప్రాధమిక నివేదిక: ఒడిశా రైలు ప్రమాదం అందరినీ కలిచి వేసింది. దాదాపు 300 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 800 మంది వరకు క్షతగాత్రులయ్యారు. ఈ ప్రమాదం పైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సందేహాలు వ్యక్తం చేసారు. యాంటీ కొలిజిన్ వ్యవస్థ ఉంటే ఈ స్థాయి ప్రమాదం జరిగేది కాదని వ్యాఖ్యానించారు.
రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. రైల్వే సేఫ్టీ కమిషన్ ప్రమాదం పైన నివేదిక ఇవ్వనుంది. ఇదే సమయంలో రైల్వే శాఖ నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక ఇచ్చింది. సిగ్నల్ లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని వెల్లడించింది. లూప్ లైన్‌లో ఉన్న గూడ్స్‌ను కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొనడం వల్లే మొదట ప్రమాదం జరిగిందని తెలిపింది.
