Latest Posts

అటు వడగాల్పులు -ఇటు చల్లని కబురు, రుతుపవనాలు..!!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగమంటున్నాయి. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో మరో రెండు రోజులు భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.

తెలంగాణలో రాబోయే నాలుగు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక..జూన్ 1న కేరళకు చేరుకోవాల్సిన నైరుతి రుతు పవనాలు నేటికి చేరుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు.

అధిక ఉష్ణోగ్రతలు: ఏపీలో మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం అల్లూరు జిల్లా చింతూరు, కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మరో 135 మండలాల్లోనూ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఉమ్మడి విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 44-45డిగ్రీలు, కోనసీమ, పశ్చిమగోదావరి, కర్నూలు, నంద్యాల, కడప, చిత్తూరు, అన్నమయ్య, జిల్లాల్లో 42-43 డిగ్రీలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 39-41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అకాల వర్షాలు, ఈదురుగాలులు, పిడుగులూ పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

YES9 TV