Latest Posts

మావోయిస్ట్ అగ్రనేత కటకం సుదర్శన్ మృతి- నెలరోజుల పాటు సంతాప సభలు

ఆదిలాబాద్: మావోయిస్ట్ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ మరణించారు. ఈ విషయాన్ని మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ నిర్ధారించింది.

ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన సంస్మరణార్థం నెలరోజుల పాటు దేశవ్యాప్తంగా సంతాప సభలను నిర్వహించనున్నట్లు తెలిపింది. సోమవారం ఈ సంతాప సభలు ఆరంభం కానున్నాయి. ఆగస్టు 3వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆయనపై కోటి రూపాయల రివార్డ్ ఉంది.

కటకం సుదర్శన్ స్వస్థలం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి. 1974లో మైనింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు. చదువుకునే సమయంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్‌ను ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర పోషించారు. సింగరేణి కార్మికుల పోరాటంలో చురుగ్గా వ్యవహరించారు. 1978లో లక్సెట్టిపేట్- జిన్నారం రీజియన్ మావోయిస్ట్ ఆర్గనైజర్‌గా అపాయింట్ అయ్యారు. రైతుల పోరాటంలో పాల్గొన్నారు.

1979లో నక్సలైట్ల భావజాలానికి ప్రభావితం అయ్యారు. విప్లవోద్యమం వైపు ఆకర్షితులయ్యారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సుమారు 59 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో గడిపారు. మావోయిస్ట్‌లో అత్యున్నత నిర్ణాయక కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడి స్థాయికి ఎదిగారు. ఉత్తర తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ మధ్య విస్తరించిన దండకారణ్యాన్ని కేంద్రబిందువుగా చేసుకుని కార్యకలాపాలను సాగించారు.

కిషన్‌జీ ఎన్‌కౌంటర్ తరువా మావోయిస్ట్ సెంట్రల్ రీజినల్ బ్యూరో చీఫ్‌గానూ పని చేశారు. ఎన్నోసార్లు పోలీసుల ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా దర్భాఘాటిలో 2013లో కాంగ్రెస్ నేతలపై మావోయిస్టుల దాడిలో 27 మంది మరణించిన ఘటన వెనుక ప్రధాన సూత్రధారి కటకం సుదర్శనే. దంతెవాడలో 70 మంది సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడికీ సూత్రధాని ఆయనే.

YES9 TV