భువనేశ్వర్: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సంభవించిన ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. 290కి చేరింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది.
హౌరా- చెన్నై మార్గంలో పట్టాల పునరుద్ధరణ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వాటిని స్వయంగా పర్యవేక్షిస్తోన్నారు.
ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని పోలీసులు, సహాయక సిబ్బంది బాలాసోర్ సహా వేర్వేరు ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. క్షతగాత్రుల పేర్లు, వివరాలను తెలియజేస్తూ రైల్వే అధికారులు ఓ జాబితాలను రూపొందించార. అలాగే- మృతదేహాలను గుర్తు పట్టడానికి వీలుగా వాటి ఫొటోలను తీసి.. వేర్వేరు వెబ్‌సైట్లల్లో పొందుపరిచారు. https://srcodisha.nic.in/, https://www.bmc.gov.in, https://www.osdma.org వెబ్‌సైట్లల్లో ఈ జాబితా, మృతదేహాల ఫొటోలు అందుబాటులో ఉన్నాయి.
