కీర్తి సురేశ్ తెలుసు కదా. మొన్ననే దసరా సినిమాలో చమ్కీల అంగీలేసి అంటూ స్టెప్పులు వేసిన అమ్ముడు త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోందట.
సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ట్రెండింగ్ టాపిక్. కీర్తి సురేశ్ ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే తనను చేసుకోబోయేది ఎవరా అని అందరిలో ఆసక్తి ఉంటుంది. ఈ మధ్య తన పెళ్లి గురించి చాలా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఓవైపు వరుస సినిమాలతో కీర్తి సురేశ్ ఫుల్ టు బిజీ అయిపోయింది. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా కీర్తి సురేశ్ బిజీ అయిపోయింది.
Keerthy Suresh father gives clarity on her marriage
ఈనేపథ్యంలో ఓ యువకుడితో ప్రస్తుతం కీర్తి సురేశ్ డేటింగ్ చేస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. అయ్యో నేను ఎవరితో డేటింగ్ లో లేను అని చాలా సార్లు కీర్తి కూడా క్లారిటీ ఇచ్చింది. అయినా జనాలు ఊరుకోవడం లేదు. ఇటీవల ఓ అబ్బాయితో కలిసి కీర్తి ఫోటో దిగింది. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తన డేటింగ్ నిజమే అన్నట్టుగా అందరూ అనుకున్నారు. అయితే.. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు.. నా ఫ్రెండ్.. అంతే. బెస్ట్ ఫ్రెండ్ తో ఫోటో దిగితే బాయ్ ఫ్రెండ్ అంటూ మమ్మల్ని సోషల్ మీడియాలోకి లాగారు అంటూ కీర్తి చెప్పుకొచ్చింది.
