బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లు కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎం కుర్చీ కోసం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఎన్ని రోజులు బెంగళూరు, ఢిల్లీలో పోటీపడ్డారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఐదు రోజుల పాటు నానా తిప్పలుపడి సిద్దరామయ్య, డీకే శివకుమార్ ను రాజీ చేసింది.
రూటు మారుస్తున్న డీకే శివకుమార్, ప్రతిపక్ష నాయకులతో ఫోటోలు, ద్వేషరాజకీయాలకు ?
30 నెలలు సిద్దరామయ్య మరో 30 నెలలు డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉండటానికి కాంగ్రెస్ పార్టీ రాజీ సూత్రంతో ఇద్దరు నాయకులను రాజీ చేసింది. ఇష్టం లేకపోయిన ఉప ముఖ్యమంత్రి పదవిలో డీకే శివకుమార్ ఉన్నారని కర్ణాటకతో పాటు దేశంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికి తెలిసిందే.
మొదటి రెండున్నర సంవత్సరాలు సిద్దరామయ్య సీఎంగా, మరో రెండున్నర సంవత్సరాలు డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేస్తారని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మీడియా ముందు అధికారికంగా ప్రకటించింది. అయితే కర్ణాటక కేపీసీసీ ప్రచార సమితి అధ్యక్షుడు ఎంబీ. పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.
కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ గా యుటి ఖాదర్, చేతులు ఎత్తేసిన సీనియర్లు, మంత్రి పదవి !
కర్ణాటక ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పాటు సిద్దరామయ్య ఉంటారని, అందులో ఎలాంటి అనుమానం లేదని బహిరంగంగా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. గత రెండు రోజుల నుంచి సిద్దరామయ్య ఐదు సంవత్సరాలు సీఎంగా ఉంటారని ఎంబీ. పాటిల్ పదేపదే పాట పాడుతున్నారు. అంతే కాకుండా తన మాటలకు తాను కట్టుబడి ఉన్నానని ఎంబీ. పాటిల్ డీకే శివకుమార్ వర్గీయులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అనుచరులు మండిపడుతున్నారు.
