తాము ఆరాధించే నటులనే అభిమానులు దేవుళ్లుగా భావిస్తారు. ఒక్కోసారి వారి అభిమానం హద్దులు దాటుతుంటుంది. ఈ క్రమంలోనే చాలా ఘటనల్లో ఫ్యాన్స్ చేసిన పనులకు హీరోహీరోయిన్లు పలు సందర్భాల్లో సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది.
తమ అభిమాన హీరో సినిమా విడుదలైతే సంతోషంతో థియేటర్లలో క్రాకర్స్ కాల్చడం లాంటివి చేస్తుంటారు. ‘సింహాద్రి’ రీ రిలీజ్ అయిన విషయం తెల్సిందే.
ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నందమూరి అభిమానులు నానా హంగామా చేశారు. కర్ణాటకలో కూడా ఫ్యాన్స్ రచ్చ చేశారు. కర్ణాటకలోని రాబర్సన్ పేట పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన కొందరు అభిమానులు మేకల తలలు నరికి థియేటర్ వద్ద హంగామా చేశారు. దీంతో పోలీసులు తొమ్మిది మంది అభిమానులను అదుపులోకి తీసుకున్నారు. థియేటర్ వద్ద రెండు మేకలను కోసినందుకు వారిని అరెస్ట్ శామని పోలీసులు వెల్లడించారు. మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు థియేటర్ వద్ద కేక్ కట్ చేసి రెండు మేకలను కోసి ఆ రక్తాన్ని ఫ్లెక్సీలపై చల్లారు. ఈ కారణంతోనే వీరిని అరెస్ట్ చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. వచ్చే సంవత్సరం వేసవిలో దీన్ని విడుదల చేయబోతున్నారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో విడుదలవబోతోంది. ఈ సినిమా తర్వాత జూనియర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. హోంబలే ఫిలింస్ వారా, లేదంటే దిల్ రాజా దీనికి నిర్మాతలన్నది ఇంకా ఖరారు కాలేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాకన్నా ముందుగా హిందీలో హృతిక్ రోషన్ తో కలిసి వార్2లో నటించబోతున్నారు. ఎన్టీఆర్ జన్మదినోత్సవం రోజు హృతిక్ రోషన్ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.
