ఇంట్లో డబ్బులు ఉన్నాయా? బ్యాంక్‌లో వీటిని దాచుకోవాలని భావిస్తున్నారా? అయితే ఏ బ్యాంక్‌లో డబ్బులు ఎఫ్‌డి చేస్తే బాగుంటుంది ?
అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. బ్యాంక్ ప్రాతిపదికన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. అందువల్ల మనం ఏ ఏ బ్యాంక్‌లో (Bank) ఎలాంటి వడ్డీ రేట్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వ బ్యాంకుల్లో ఎక్కువ వడ్డీ వస్తుందో.. ప్రైవేట్ బ్యాంకుల్లో అధిక వడ్డీ ఉందో మనం ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం చాలా వరకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు అనేవి 6.8 శాతం నుంచి 7.2 శాతం వరకు ఉన్నాయి. అయితే చిన్న ప్రైవేట్ బ్యాంకులు అయితే 7 నుంచి 8 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం చాలా వరకు బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుకుంటూ వెళ్తున్నాయి. రుణాలకు డిమాండ్ నెలకొనడంతో బ్యాంకులు కూడా ప్రజల వద్ద నుంచి ఎక్కువగా డిపాజిట్లు సంపాదించాలని చూస్తున్నాయి. తద్వారా రుణ డిమాండ్ అందిపుచ్చుకోవాలని చూస్తున్నాయి. అందుకే ఎఫ్‌డీ రేట్ల పెంచేస్తున్నాయి.
రూ.300 పొదుపుతో రూ.2 కోట్ల 36 లక్షలు వెనకేయండి.. ఈ స్కీమ్‌లో చేరితే డబ్బే డబ్బు!
6 నెలల నుంచి ఐదేళ్ల టెన్యూర్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకులను గమనిస్తే.. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేటు 5 శాతం నుంచి 6.75 శాతం వరకు ఉంది. కెనరా బ్యాంక్ అయితే 6.25 శాతం నుంచి 7 శాతం వడ్డీని అందిస్తోంది. ఇండియన్ బ్యాంక్‌లో 3.85 శఆతం నుంచి 6.7 శాతం వరకు వడ్డీ ఉంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 4.95 శాతం నుంచి 6.8 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. ఇంకా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5.5 శాతం నుంచి 7 శాతం వరకు, ఎస్‌బీఐలో 5.25 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ ఉంది. ఇక యూనియన్ బ్యాంక్‌లో 4.4 శాతం నుంచి 7.3 శాతం వరకు వడ్డీ లభిస్తోంది.
రూ.2 వేల నోట్లపై
ఎస్‌బీఐ కీలక ప్రకటన.. ప్రజలకు అదిరే శుభవార్త!
అలాగే ప్రైవేట్ రంగ బ్యాంకులను గమనిస్తే.. బంధన్ బ్యాంక్‌లో 4.5 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీ ఉంది. సిటీ యూనియన్ బ్యాంక్‌లో 6 శాతం నుంచి 6.75 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో 4.75 శాతం నుంచి 7.1 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. ఇండస్ఇండ్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 5 శాతం నుంచి 7.75 శాతం వరకు వస్తుంది. ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌లో 5 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో 6.2 శాతం నుంచి 7.1 శాతం వరకు వడ్డీ ఉంది. ఆర్‌బీఎల్ బ్యాంక్ 7 శాతం, యస్ బ్యాంక్ 7.75 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 7.2 శాతం దాకా ఉంది.
