అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ పర్సనాలిటీ. ఆమె బిగ్ బి, మిగిలిన బచ్చన్ కుటుంబం వలె నటి కాదు.
వ్యాపారంలో రాణిస్తుంది. నవ్య.. ఆరా హెల్త్ అనే మహిళా కేంద్ర ఆరోగ్య సంస్థకు సహ వ్యవస్థాపకురాలు. తన వ్యాపారం, ఫోటోషూట్‌లకు సంబంధించి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నవ్య.. తాజాగా ట్రాక్టర్ నడుపుతున్న వీడియోను షేర్ చేసింది. విలాసవంతమైన జీవితాన్ని గడిపే వీలున్న నవ్య.. స్థానిక ప్రజలతో ఎంతో ప్రేమగా, తీరికగా గడుపుతుందని అభిమానులు కొనియాడుతున్నారు.
