Latest Posts

15 కోట్లు పెట్టి రివేంజ్.. 600 భాషల్లో తీయాలి.. నరేష్ ఆసక్తికర కామెంట్స్

టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేష్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ మళ్లీ పెళ్లి (Malli Pelli). విజయకృష్ణ మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకనిర్మాత ఎమ్ఎస్ రాజు దర్శకత్వం వహించారు.

 

పవిత్ర లోకేష్ తో కిస్సింగ్ వీడియోతో మొదలైన ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ లో నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతిపై ప్రతీకారం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బోల్డ్ కాన్సెప్ట్: నరేష్, పవిత్ర లోకేష్ నటించిన మళ్లీ పెళ్లి సినిమాను మే 26న చాలా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయనున్నారు. తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మీడియా ప్రశ్నలకు నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఎమ్ఎస్ రాజు ఆలోచనలు చాలా యంగ్ గా ఉంటాయి.

యువ ప్రపంచానికి కనెక్ట్ అయితేనే సినిమా సక్సెస్ అవుతుంది. కాన్సెప్ట్ బోల్డ్ గా ఉండాలి. ప్రపంచంలో ఏం జరుగుతుందో, ఈ సినిమాలో అదే చూపించాం. ఏ ఒక్కరికో సంబంధించిన సినిమా కాదు. ఇందులో చాలా యాంగిల్స్ ఉన్నాయి” అని నరేష్ తెలిపారు.

నా సబ్జెక్ట్ కాదు: మళ్లీ పెళ్లి మీ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా అన్న ప్రశ్నకు.. “అది మీరు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెబితే కథ రివీల్ అయినట్లే కదా. అందుకే కథను నేను రివీల్ చేయలేను. సినిమా చూస్తే అన్ని విషయాలు తెలుస్తాయి.

ఇది యూనిక్ ఫిల్మ్” అని నరేష్ అన్నారు. తర్వాత రఘుపతి వెంకయ్య నాయుడు బయోపిక్ తర్వాత మీ బయోపిక్ మీరు తీసుకుంటున్నట్లుగా ఉంది అన్నదానికి “అది బయోపిక్. ఇది ఎంటర్టైనర్. ఇది నా సబ్జెక్ట్ కాదు” అని వెల్లడించారు.

5 భాషల్లో రిలీజ్: తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ చేసేందుకు గల కారణాలపై “కర్ణాటకలో పవిత్ర పాపులర్. నేను తెలుగులో పాపులర్. ఈ రెండు భాషల్లో విడుదల చేస్తే సినిమా కనెక్ట్ అవుతుందని భావించాం. నిజానికి మళ్లీ పెళ్లి అనే ఈ సినిమాను ఓ 600 భాషల్లో తీయాలి. ప్రస్తుతం 5 భాషల్లో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాం. ఇంకా మున్ముందు ఎక్కువ లాంగ్వెజెస్ లో డబ్ చేసే అవకాశం ఉంది” అని నరేష్ పేర్కొన్నారు.

YES9 TV