టీడీపీ అధినేత చంద్రబాబు ఉభయగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శిస్తూ… పాడైపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉన్నారు. దీంతో చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ మాజీమంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. టీడీపీని డ్రామా కంపెనీల చంద్రబాబు నడుపుతున్నారని మీడియా సమావేశంలో విమర్శించారు. సీఎం జగన్ పై చంద్రబాబు మరీ దిగజారుడు భాష మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం కరువుతో అల్లాడిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అకాల వర్షాలకు పంటలు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈలోపే రాజకీయ రాబందు మాదిరిగా చంద్రబాబు వాలిపోయారు. రైతు బాంధవుడులా ఫోజులు కొడుతూ సీఎం జగన్ కూ శాపనార్థాలు పెట్టుకుని తిరుగుతున్నాడు. చంద్రబాబు దరిద్రం వల్లే రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. చంద్రబాబు పూర్తి ఒత్తిడిలో ఉన్నారు. జగన్ సీఎం అయ్యాకే రైతులు సంతోషంగా ఉన్నారు. పరామర్శల పేరుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రైతులను విస్మరించారు అంటూ కన్నబాబు.. తీవ్రస్థాయిలో మీడియా సమావేశంలో మండిపడ్డారు
