Latest Posts

జగనన్నకు చెబుదాం – 1902 టోల్ఫ్రీ నెంబర్.

మరావతి: జగనన్నకు చెబుదాం – 1902 టోల్ఫ్రీ నెంబర్.ఉదయం 11గంటలకు సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

సంతృప్త స్ధాయిలో ప్రజా వినతుల పరిష్కారమే లక్ష్యంగా కొత్త కార్యక్రమం.ప్రతి వినతి పరిష్కారం అయ్యే వరకూ ట్రాకింగ్.సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత స్ధాయిలో మీకు ఎదురయ్యే మీ సమస్యలకు మరింత మెరుగైన, నాణ్యమైన పరిష్కారం చూపాలన్న తపనతో–జగనన్నకు చెబుదాం.

వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుకోవడంలో మీకు ఏమైనా ఇబ్బందులున్నా.వైఎస్సార్ పెన్షన్ కానుక అందుకోవడంలో ఏమైనా సమస్యలు ఉన్నా, రేషన్ కార్డు వంటివి పొందడంలో ఏమైనా అవాంతరాలు ఎదురైనా.రైతన్నలకైనా, అక్కచెల్లెమ్మలకైనా, అవ్వాతాతలకైనా, మరెవరికైనా ప్రభుత్వ సేవలు పొందడంలో ఏమైనా అవాంతరాలు ఎదురైనా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు అందుకోవడంలో ఏమైనా సమస్యలున్నా.రెవెన్యూ రికార్డులకు సంబంధించి ఏమైనా సమస్యలున్నా.ప్రభుత్వ సేవలకు సంబంధించి మరే ఇతర వ్యక్తిగత ఇబ్బందులున్నా.ప్రభుత్వ సేవలకు సంబంధించి ఇలాంటి ఏ సమస్య పరిష్కారానికైనా జగనన్నకు చెబుదాం – 1902.

మీ సమస్యకు పరిష్కారం ఎలా జరుగుతుందంటే.. 1. మీ సమస్యను చెప్పేందుకు 1902 టోల్ఫ్రీ నెంబర్కు కాల్ చేయండి

2. కాల్ సెంటర్ ప్రతినిధితో మీ సమస్యను చెప్పండి

3. మీ ఫిర్యాదును నమోదు చేసుకుని YSR (యువర్ సర్వీస్ రిక్వెస్ట్) ఐడీని కేటాయిస్తారు

4. ఎప్పటికప్పుడు మీ అర్జీ స్టేటస్ గురించి ఎస్ఎంఎస్ ద్వారా మీకు అప్డేట్ అందుతుంది

Posted Under AP
YES9 TV