Latest Posts

ఏపీలో సంచలనం సృష్టించిన తుని రైలు దగ్ధం

పీలో సంచలనం సృష్టించిన తుని రైలు దగ్ధం కేసును విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది. తొమ్మిదేళ్ల విచారణ తరువాత కేసును న్యాయస్థానం డిస్మిస్ చేసింది.

కాపు ఉద్యమం సందర్భంగా రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను దగ్ధం కేసులో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 2016 జనవరి 31న కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో భాగంగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభవ ఆధ్వర్యంలో తునిలో భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తుని సభకు తరలివచ్చిన ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం 41 మందిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

Posted Under AP
YES9 TV