– కర్నూలు జిల్లా ఆలూరు-అరికెర గురుకుల పాఠశాలలో ఘటన..ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెన్షన్

– కర్నూలు జిల్లా ఆలూరు-అరికెర గురుకుల పాఠశాలలో ఘటన..ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
ఆలూరు న్యూస్…
ఆలూరు మండలం అరికెర గురుకుల పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో విద్యార్థులు మద్యం, ధూమపానం సేవించిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, కొంతమంది ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే విద్యార్థులు అలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. విచారణలో ఆరోపణలకు సంబంధించి వాస్తవాలు నిర్ధారణ కావడంతో విద్యార్థులను ప్రోత్సహించినట్లు గుర్తించిన ముగ్గురు ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ వారిని సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన విద్యాసంస్థల్లో క్రమశిక్షణ, విద్యార్థుల భద్రత, నైతిక విలువల పరిరక్షణపై మరోసారి చర్చకు దారితీసింది. అధికారులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

Posted Under AP
Editor