వెంపాడు టోల్ ప్లాజా వద్ద భారీ గంజాయి పట్టివేత..

అనకాపల్లి జిల్లా నక్కపల్లి

*వెంపాడు టోల్ ప్లాజా వద్ద భారీ గంజాయి పట్టివేత*

*264 కిలోల గంజాయి,రెండు కార్లు స్వాధీనం*

*రూ.1.34 లక్షల గంజాయి*

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వెంపాడు టోల్ ప్లాజా సమీపంలో పోలీసులు భారీ గంజాయి రవాణాను భగ్నం చేశారు. ఈగల్ టీమ్ అందించిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి వచ్చిన అనుమానాస్పద ఇన్నోవా, ఎర్టిగా కార్లను తనిఖీ చేయగా 264 కిలోల గంజాయి బయటపడింది.

ఈ మేరకు నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో నర్సీప ట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు, నక్కపల్లి సీఐ మురళితో కలిసి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించా రు. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురు నిందితులు సోమేష్, కవటి సాయి తేజ, సచిన్ గెహ్లాట్, రాజబాబును అరెస్టు చేసి నట్లు తెలిపారు.

స్వాధీనం చేసుకున్న 264 కిలోల గంజాయి విలువ సుమారు ఒక కోటి 34 లక్షలు కాగా, రెండు కార్లు, ఐదు మొబైల్ ఫోన్లతో కలిపి మొత్తం స్వాధీనం విలువ రూ.1.69 లక్షలు గా పోలీసులు పేర్కొన్నారు.

విచారణలో రోలుగుంటకు చెందిన మలసాల మోహన్ అలియాస్ వెంకట్ అలియాస్ పరమేశ్ ఈ గంజాయి రవాణా నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది. అలాగే కేరళ, మంగ ళూరుకు చెందిన వ్యక్తులు ఈ గంజాయిని స్వీక రించాల్సి ఉన్నట్లు గుర్తించారు.

నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమో దు చేసి, పరారీలో ఉన్న ముఠా సభ్యుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సైలు సన్నిబాబు, అంజూతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Posted Under AP
Editor