ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు ఒకరకంగా సందడి చేస్తూ హైలైట్ అవుతోన్నారు. ఫలితంగా ఎన్నో రకాల అవశాకాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోన్నారు. అందులో బోల్డు బ్యూటీ ఇనాయా సుల్తానా ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది.. ఈ మధ్యనే బిగ్ బాస్ షో పుణ్యమా అని యమ ఫేమస్ అయింది. అప్పటి నుంచి వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ ఇనాయా హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ వీడియోను వదిలింది. అది మీకోసమే! అలా వచ్చి.. ఎన్నో చిత్రాలు:
ఇనాయా సుల్తానా మోడల్‌గా సత్తా చాటుతూ ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడింది. దీంతో ఆమెకు ఎన్నో సినిమాలలో అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ‘ఏవం జగత్’ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘బుజ్జి ఇలారా’, ‘నటరత్నాలు’, ‘యద్భావం తద్భవతి’ వంటి ఎన్నో సినిమాల్లో నటించింది. అయినప్పటికీ ఆమెకు అనుకున్న గుర్తింపు దక్కలేదు. వర్మ పార్టీ… బిగ్ బాస్ ఆఫర్: సినిమా నటి అవడానికి తోడు రాంగోపాల్ వర్మతో పార్టీలో రచ్చ చేసి సంచలనంగా మారడంతో ఇనాయా సుల్తానాకు బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఛాన్స్ వచ్చింది. ఇందులోకి సాదాసీదాగానే అడుగు పెట్టిన ఈ సుందరాంగి.. బోల్డునెస్‌తో పాటు ఆటతీరుతో ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే టాస్కుల్లోనూ చక్కగా ఆడుతూ, డేర్ అండ్ డైనమిక్‌గా ఉంటూ ఫినాలే ముందే ఎలిమినేట్ అయింది.
