బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో కేసీఆర్ హాట్ కామెంట్స్

హైదరాబాద్ తెలంగాణభవన్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరిని కేసీఆర్ హెచ్చరించారని తెలుస్తోంది.

వ్యక్తిగత ప్రతిష్టకు పోకుండా ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కలిసి పని చేయాలని కేసీఆర్ సూచించారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని చెప్పారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి సమస్య ఉంటే లీడర్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దని తెలిపారు. అందరూ ఎన్నికలే టార్గెట్ గా పని చేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి సమస్యలు ఉన్నా అధిష్టానానికి తెలపాలని సూచించారు.

YES9 TV