సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ హారర్ త్రిల్లర్ మూవీ విరూపాక్ష బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి వీకెండ్ లోనే ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా ఒక రికార్డును క్రియేట్ చేసింది.
అంతేకాకుండా సోమవారం కలెక్షన్స్ తో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా పూర్తి చేయడానికి సిద్ధమయింది. ఇక నిర్మాతలకు 5వ రోజు నుంచి భారీ స్థాయిలో ప్రాఫీట్స్ అందుకోబోతున్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా కథలో చివరలో దర్శకుడు ఇచ్చిన ఒక ట్విస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. చివరలో హీరోకు దెయ్యం పట్టడంతో సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని అందరూ ఒక సందేహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆ విషయంలో ఇంటర్వ్యూలో ఎక్కడ కూడా చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇవ్వలేదు. కానీ హీరో సాయిధరమ్ తేజ్ మాత్రం ఇటీవల సోషల్ మీడియాలో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
ట్విట్టర్ లో సాయి ధరమ్ తేజ్ చిట్ చాట్ చేయగా.. సినిమా చివరిలో ఇచ్చిన ట్విస్టుతో సీక్వెల్ ఉంటుందా ఉండదా అనే విషయాన్ని అడగడంతో సాయిధరమ్ తేజ్ ఉంది కాబట్టే అలా హింట్ ఇచ్చాము అని ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు దీంతో ఈ సినిమాను అమితంగా ఇష్టపడిన వారికి ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక ఆ సీక్వెల్ ప్రాజెక్ట్ దర్శకుడు కార్తీక్ ఎప్పుడు తెరపైకి తీసుకువస్తాడా? అని ఓవర్గం వారు ఎక్కువగా ప్రశ్నలు సంధించారు.
ఇక సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియాలో అనేక రకాల విషయాలపై స్పందిస్తూ తప్పకుండా సీక్వెల్ అయితే ఉంటుంది అని ఒక వివరణ అయితే ఇచ్చాడు. మరి దర్శకుడు సీక్వెల్ కథను ఎప్పుడు తెరపైకి తీసుకు వస్తాడో చూడాలి. ఇక విరూపాక్ష సినిమా కథలో దర్శకుడు సుకుమార్ చాలా హెల్ప్ చేశారు అని ఆయన ఇచ్చిన సలహాలతోనే కొన్ని ట్విస్ట్ లు క్రియేట్ అయినట్లుగా దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. మరి సెకండ్ పార్ట్ కోసం మళ్లీ సుకుమార్ తో ఈ దర్శకుడు కలిసి వర్క్ చేస్తాడో లేదో చూడాలి.
