ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 సినిమా షూటింగ్ చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. దర్శకుడు సుకుమార్ ఈ సినిమా శరవేగంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఊహించని విధంగా కొద్ది రోజుల క్రితం మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంపై ఐటి అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు.
నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి ఆఫీసులలో కూడా తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో పుష్ప 2 షూటింగ్లో ఉన్న సుకుమార్ కార్యాలయం పై కూడా ఐటి అధికారులు దాడి చేసి సోదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పుష్ప 2 షూటింగ్ వాయిదా పడింది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయపై అధికారులు దాడులు చేసిన నేపథ్యంలో అనధికారికంగా 700 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారంట. ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్ లో ఇదే హాట్ టాపిక్ గా వినిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలో అనధికారికంగా పెట్టుబడులు పెడుతున్నారు అంటూ ప్రచారం కూడా తెరపైకి వచ్చింది.
ఈ అనధికారిక లావాదేవీలకు సంబంధించిన వివరాలపై అధికారులు పూర్తిగా పరిశీలన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప 2 మూవీస్ షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముంబై వెళ్లారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో టీ సిరీస్ బ్యానర్ లో తాను చేయబోయే నెక్స్ట్ సినిమాకి సంబంధించిన చర్చలు కోసం బన్నీ ముంబై వెళ్ళినట్లుగా టాక్ వినిపిస్తోంది.
