ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చోటు చేసుకున్న ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ రావు స్పందించారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఘాటు విమర్శలు సంధించారు. దళిత శాసనసభ్యుడు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న యర్రగొండపాలెం నియోజకవర్గంలో అశాంతికి కారకుడయ్యాడంటూ మండిపడ్డారు. దళిత వ్యతిరేకిగా చంద్రబాబుకు ముద్ర ఉందని, అది చెరిపినా చెరిగేది కాదని జూపూడి అన్నారు. కారంచేడు మొదలుకుని యర్రగొండపాలెం వరకు దళితులపై జరిగిన దాడుల్లో చంద్రబాబు హస్తం ఉందని ధ్వజమెత్తారు. చంద్రబాబు వర్గం కారంచేడులో దళితులను ఊచ కోత కోసిన విధానాన్ని ఎవ్వరూ మరిచిపోలేరని చెప్పారు. చంద్రబాబును మనిషి రూపంలో ఉన్న సైతాన్‌గా అభివర్ణించారు. దళితులు ఏం పీకుతారు.. అంటూ చంద్రబాబు కొడుకు నారా లోకేష్ అవమానించాడని, ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?
అని మాట్లాడిన నోరు చంద్రబాబుదని జూపూడి గుర్తు చేశారు. చంద్రబాబు-నారా లోకేష్ ఇద్దరిదీ దళిత వ్యతిరేక డీఎన్ఏ అని ధ్వజమెత్తారు. దళితులపై చేసిన వ్యాఖ్యలకు ఆ సామాజిక వర్గ మంత్రిగా ఆదిమూలపు సురేష్ నిరసన తెలియజేస్తే- బూతులు మాట్లాడిన ఘనుడు చంద్రబాబు అని ఆరోపించారు. టీడీపీతో పెట్టుకుంటే పవన్‌కు నష్టమే: మాజీ మంత్రి లెక్క ఇదీ..!! 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటోన్న చంద్రబాబుకు దళితుల పట్ల ఇప్పటికీ సరైన దృక్పథం లేదని జూపూడి విమర్శించారు. దళితులు, కులాలు, కుటుంబాలను కూడా విడదీయగల శక్తిసామర్థ్యాలు చంద్రబాబు ఉన్నాయని అన్నారు.
అమరావతి రాజధానిలో ఇళ్ల స్థలాలను దళితులకు, పేదలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే- డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని అడ్డుకున్నది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారాయన. దళితులకు క్షమాపణలు చెప్పే వరకు చంద్రబాబును వదలకూడదని, ఆయన పర్యటనలను అడ్డుకోవాలంటూ జూపూడి పిలుపునిచ్చారు. ఆయన రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా దళితులు అడ్డుకుంటారని, నిరసనలను తెలియజేస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తోంటే- చంద్రబాబుకు కడుపు మంటలా ఉందని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పేరుతో, వైఎస్ కుటుంబంలో చొరబడి చంద్రబాబు చిచ్చు పెడుతున్నాడని జూపూడి ఆరోపించారు. తన అనుకూల మీడియా ద్వారా విషం కక్కుతున్నాడని ధ్వజమెత్తారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా చంద్రబాబును రాజకీయంగా సమాధి చేయడానికి దళితులు సిద్ధంగా ఉన్నారని, దళిత నియోజకవర్గాల్లోనే కాకుండా ఏ సీటులో కూడా టీడీపీకి గెలిచే పరిస్థితి లేదని అన్నారు.
దళితులకు పిలుపునిచ్చిన జూపూడి
