Latest Posts

దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అమ్ముల పొదిలో మరో కొత్త అస్త్రం

భువనేశ్వర్: దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అమ్ముల పొదిలో మరో కొత్త అస్త్రం చేరింది. ఇప్పటివరకు లేని సరికొత్త తరహా క్షిపణిని ఇది. డీఆర్డీఓ విజయవంతంగా దీన్ని పరీక్షించింది. డీఆర్డీఓ- నౌకాదళాధికారులు సంయుక్తంగా ఈ రాకెట్ మిస్సైల్ ప్రయోగాన్ని చేపట్టారు. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలండ్‌ నుంచి పరీక్షించారు. శుక్రవారం ఈ మిస్సైల్ టెస్ట్ విజయవంతంగా ప్రయోగించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. దళితులకు పిలుపునిచ్చిన జూపూడి దీని పేరు ఎండో-అట్మాస్ఫెరిక్ ఇంటర్‌సెప్టార్ మిస్సైల్. నౌకాదళం కోసం డీఆర్డీఓ ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది.

శతృదేశాలు సంధించే ఇంటర్ బాలిస్టిక్స్ క్షిపణులను ధ్వంసం చేసే సామర్థ్యం దీనికి ఉంది. సముద్ర ఉపరితలం నుంచి దీన్ని ప్రయోగించవచ్చు. దేశ సముద్ర జలాల సరిహద్దుల్లో దీన్ని మోహరించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. శతృదేశాలు ప్రయోగించే ఎలాంటి ఇంటర్ బాల్లిస్టిక్ క్షిపణిని అయినా ఇది ధ్వంసం చేయగలదని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు వివరించారు. తుఫాన్ల వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఈ క్షిపణి తన లక్ష్యాన్ని ఛేదించగలదని పేర్కొన్నారు. ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మిస్సైల్ ఇప్పటివరకు నౌకాదళంలో లేదని, ఇలాంటి మిస్సైల్‌ను అభివృద్ధి చేయడం ఇదే తొలిసారిగా చెప్పారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల డీఆర్డీఓ ఛైర్మన్ డాక్టర్ సమీర్ వీ కామత్ హర్షం వ్యక్తం చేశారు.

నౌకాదళ బాలిస్టిక్ క్షిపణి రక్షణ సామర్థ్యాలను కలిగి ఉన్న దేశాల జాబితాలో తాము చేరామని అన్నారు. ఈ ఘటనను ఓ మైలురాయిగా అభివర్ణించారాయన. అత్యాధునిక నెట్‌వర్క్-సెంట్రిక్ యాంటీ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేసే విషయంలో దేశం.. స్వావలంబనను సాధించిందని వ్యాఖ్యానించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యున్నత ప్రమాణాలతో ఈ మిస్సైల్‌ను అభివృద్ధి చేశామని, ఇది నిర్దేశిత లక్ష్యాన్ని.. నిర్దేశించిన షెడ్యూల్‌లోనే ఛేదించిందని డాక్టర్ సమీర్ వీ కామత్ చెప్పారు. అంతకంటే ముందు- డీఆర్డీఓ శతృదేశాల బాలిస్టిక్ క్షిపణిని ధ్వంసం చేయగల భూ-ఆధారిత బాల్లిస్టిక్ మిస్సైల్ డెవలప్‌మెంట్ సిస్టమ్‌ను విజయవంతం చేశామని అన్నారు.

YES9 TV