Latest Posts

సెన్సిబుల్ సినిమాలు తీసే శేఖర్ కమ్ముల, డిఫరెంట్ చిత్రాల హీరో ధనుష్ కాంబినేషన్ లో సినిమా అనగానే అందరికీ ఆసక్తి డబల్

సెన్సిబుల్ సినిమాలు తీసే శేఖర్ కమ్ముల, డిఫరెంట్ చిత్రాల హీరో ధనుష్ కాంబినేషన్ లో సినిమా అనగానే అందరికీ ఆసక్తి డబల్ అయింది. 2021 చివర్లోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.

అయితే ఇప్పటివరకూ ఈ చిత్రానికి సంబంధించిన ఊసే లేదు. దీని తర్వాత ప్రకటన వచ్చిన సార్ చిత్రం కూడా పూర్తై, విడుదలైపోయింది కానీ ఇంకా శేఖర్ కమ్ముల చిత్రం గురించి ఎక్కడా చడీచప్పుడు లేదు.

ఇక తాజా సమాచారం ప్రకారం తెల్సింది ఏంటంటే ప్రస్తుతం ధనుష్ కెప్టెన్ మిల్లర్ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం కోసమే స్వామీజీల తరహాలో గుబురు గెడ్డం పెంచాడు ధనుష్. సో, ఈ చిత్ర షూటింగ్ మొత్తం పూర్తయితే కానీ మరో సినిమాకు వెళ్ళడానికి లేదు. కాబట్టే శేఖర్ కమ్ముల చిత్రం ఆలస్యమవుతోందిట.

మరోవైపు శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి సంబంధించిన బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉండడమే కాకుండా ప్రీప్రొడక్షన్ పనులు మొదలుపెట్టడానికి కూడా సన్నాహాలు చేస్తున్నాడట.

YES9 TV