Latest Posts

జేడీ ఉవాచ.! జనం సొమ్ముతో స్టీలు ప్లాంటు కొనుగోలు.?

సినీ రంగంలో క్రౌడ్ ఫండింగ్ అనే మాట కొన్నాళ్ళ క్రితం గట్టిగా వినిపించింది. విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి రాజకీయాల్లో ఈ ‘క్రౌడ్ ఫండింగ్’ మాటని ప్రస్తావించారు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మినారాయణ.

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి విశాఖ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు లక్ష్మినారాయణ. ఓడినాసరే, ఓటర్లను డబ్బుతో ప్రలోభ పెట్టకుండా ఆ మాత్రం ఓట్లు దక్కించుకున్న దరిమిలా, తాను గెలిచినట్లే భావిస్తానని ‘జేడీ’ అంటుంటారు. అది నిజం కూడా.!

ఇక, విశాఖ ఉక్కు పరిశ్రమ – క్రౌడ్ ఫండింగ్ విషయానికొస్తే, ఏకంగా 850 కోట్ల రూపాయల్ని క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించడం సాధ్యమేనా.? తెలుగు ప్రజలు తలా వంద రూపాయలు వేసుకుంటే సరిపోతుందన్నది జేడీ లక్ష్మినారాయణ లెక్క. నిజానికి, వినడానికి చాలా సౌండింగ్‌తో కూడుకున్న పాజిటివ్ అంశమే ఇది.

విశాఖ స్టీలు ప్లాంటు అనేది ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో వుంది. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. అంటే ఏంటి.? అది దేశ ప్రజల ఆస్తి. దాన్ని కేంద్రం అమ్మేయాలనుకుంటోంది. డిజిన్వెస్టిమెంట్.. అదేనండీ పెట్టుబడుల ఉప సంహరణ పేరుతో. అలా వచ్చే సొమ్ముల్ని కేంద్రం ఏం చేస్తుంది.? అన్నది వేరే చర్చ.

ప్రభుత్వ రంగ సంస్థ అంటే, అది ప్రజల ఆస్తి. ఆ ప్రజల ఆస్తిని కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తోంటే, మళ్ళీ ఆ ప్రజలే.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా మళ్ళీ ఆస్తిని కొనుగోలు చేసుకోవడమన్నమాట.! ఇదే కలికాలం అంటే.! తెలంగాణ ప్రభుత్వం విశాఖ ఉక్కుని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చినా.. ఈ క్రౌడ్ ఫండింగ్ అయినా.. మంచి ఆలోచనగానే భావించాలిగానీ.. అత్యంత బాధాకరమైన పరిస్థితి ఇది.

వేల కోట్ల ఆస్తుల్ని.. అదీ ప్రజల ఆస్తుల్ని ప్రభుత్వాలు అమ్మేసి, తిరిగి ప్రజల్ని అప్పుల ఊబిలో ముంచేస్తుండడాన్ని ఏమనాలి.? దేశాన్ని అమ్మేస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?
అసలంటూ అమ్మకే జరగకూడదు.! దానికి ఏం చేయాలో ఆలోచించాలిగానీ, మీరు అమ్మేయండి.. మేం కొంటాం.. అనడమంటే అదే భావదారిద్ర్యం.!

YES9 TV