Latest Posts

శాకుంతలంపై ట్రోల్స్.. ఒకేఒక్క పోస్ట్ తో చెక్ పెట్టిన సమంత

సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం (Sakunthalam) సినిమా ఇటివల విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

దీంతో నెట్టింట సినిమాపై ట్రోల్స్ నడుస్తున్నాయి. ఈక్రమంలో భగవద్గీతలోని ఓ అద్భుత శ్లోకాన్ని ఉదహరిస్తూ సమంత (Samantha) చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది.

కారులో కూర్చుని బయటకు చూస్తున్న సమంత ఫొటోకు ఈ శ్లోకాన్ని క్యాప్షన్ గా పెట్టుకుంది. ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి’ (పని చేయడం వరకూ నీ పని.. ఫలితాన్ని ఆశించకు.. ఫలితంతో నీకు సంబంధం లేదు.. ఫలితాన్ని ఆశించకు.. ఆశించి ఏ పనీ చేయకు.. అలా అని పని చేయడం మానకు) అనే గీతా శ్లోకాన్ని రాసుకొచ్చింది.

సినిమాకు సంబంధించి వస్తున్న ట్రోల్స్ పై చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి స్పందన లేదు. కెరీర్లో జయాపజయాలు సహజం అనే విధంగా సమంత పరోక్షంగా సినిమా ఫలితంపై స్పందించిందనే అంటున్నారు. ప్రస్తుతం సమంత ఖుషి సినిమా , సిటాడెల్ (Citadel) వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

YES9 TV