బాబాసాహెబ్​ అంబేడ్కర్​ గురించి మీకు తెలియని విషయాలెన్నో!

1891 ఏప్రిల్​ 14న మధ్యప్రదేశ్​లో జన్మించారు డా. బీ. ఆర్​ అంబేడ్కర్​. దళిత వర్గానికి చెందిన ఆయన తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. దళితుడైన కారణంగా అంబేడ్కర్​ను అంటరానివాడిగా చూసేవారు. స్కూల్​కు వెళ్లినా వేరువేరుగా కూర్చోవాల్సిన పరిస్థితి. ఒక్కోసారి క్లాస్​రూమ్​లోనే కూర్చోనిచ్చేవారు కాదు! ఇన్ని కష్టాల నుంచి అంచెలంచెలుగా ఎదిగిన అంబేడ్కర్​.

. ఒక గొప్ప ఎకనామిస్ట్​గా, జ్యూరిస్ట్​గా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన కమిటీకి నాయకత్వం వహించిన ఘనత అంబేడ్కర్​ సొంతం. ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. బాబాసాహెబ్​ అంబేడ్కర్​ జయంతి సందర్భంగా.. ఆయన గురించి పలు ఆసక్తికర, ఎవరికి తెలియని విషయాలను నెమరవేసుకుందాము..

జయహో అంబేడ్కర్​..

బాబాసాహెబ్​ అంబేడ్కర్​.. తన తల్లిదండ్రులకు 14వ సంతానం. ఆయన పూర్తి పేరు భీమ్​రావ్​ రామ్​జీ అంబేడ్కర్​.

బీ. ఆర్​ అంబేడ్కర్​ అసలు ఇంటి పేరు అంబావాడేకర్​. ఆ పేరును అంబేడ్కర్​గా మార్చారు ఆయన టీచర్​ మహదేవ్​ అంబేడ్కర్​.

Unknow facts about BR Ambedkar : విదేశాల్లో ఎకనామిక్స్​ నుంచి పీహెచ్​డీ పొందిన తొలి భారతీయుడు బాబాసాహెబ్​ అంబేడ్కర్.

త్రివర్ణ పతాకాన్ని రూపొందించింది పింగళి వెంకయ్య అన్న విషయం తెలిసిందే. అయితే.. జెండాలోకి అశోక చక్ర.. బీ.ఆర్ అంబేడ్కర్​ వల్లే వచ్చింది!​

నోబుల్​ బహుమతి పొందిన ప్రొఫెసర్​ అమర్త్య సేన్​.. అబేడ్కర్​ను ‘ఫాథర్​ ఆఫ్​ ఎకనామిక్స్​’గా సంబోధిస్తారు.

BR Ambedkar statue in Hyderabad : మధ్యప్రదేశ్​, బీహార్​ అభివృద్ధి కోసం ఈ రాష్ట్రాలను విభజించాలని 50వ దశకంలోనే చెప్పారు అంబేడ్కర్​. 2000లో ఛత్తీస్​గఢ్​, ఝార్ఖండ్​ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.

బాబాసాహెబ్​ అంబేడ్కర్​కు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. ఆయన వ్యక్తిగత గ్రంథాలయం పేరు ‘రాజ్​గిర్​’. అందులో 50వేలకుపైగా పుస్తకాలు ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్​ లైబ్రరీగా అది గుర్తింపు తెచ్చుకుంది.

ప్రపంచంలో టాప్​ 100 స్కాలర్స్​ లిస్ట్​ను 2004లో తయారు చేసింది కొలంబియా యూనివర్సిటీ. ఈ జాబితాలో మొదటి పేరు డా. భీమ్​రావ్​ రామ్​జీ అంబేడ్కర్​ది! ఆయన రాసిన ‘వెయిటింగ్​ ఫర్​ ఎ వీసా’ పుస్తకం.. కొలంబియా వర్సిటీలో ఓ టెక్స్ట్​బుక్​.

BR Ambedkar quotes : బీ. ఆర్​ అంబేడ్కర్​కు 64 సబ్జెక్ట్​లలో మాస్టర్స్​ డిగ్రీ ఉంది! హిందీ, పాలీ, సంస్కృతం, ఇంగ్లీష్​, ఫ్రెంచ్​, జర్మన్​, మరాఠీ, పర్షియన్​, గుజరాతీ వంటి భాషలు ఆయనకు తెలుసు. వీటితో పాటు దాదాపు 21ఏళ్ల పాటు.. ప్రపంచంలోని అన్ని మతాల గురించి చదివారు.

లండన్​ స్కూల్​ ఆఫ్​ ఎకనామిక్స్​లో 8ఏళ్ల కోర్సును కేవలం 2ఏళ్ల 3 నెలల్లో పూర్తి చేశారు అంబేడ్కర్​. ఇందుకోసం ఆయన రోజుకు 21 గంటలు చదువుకునేవారు.

అంబేడ్కర్​తో పాటు ఆయన అనుచరులు 8,50,000 మంది బౌద్ధమతంలోకి మారారు. ప్రపంచంలో మతమార్పిడి విషయంలో ఇప్పటికీ ఇదే అతిపెద్దది!

బాబాసాహెబ్​ అంబేడ్కర్​ను ‘ది మోడర్న్​ బుద్ధ ఆఫ్​ దిస్​ యేజ్​ (ఈ తరం బుద్ధుడు)’ అని పిలిచేవారు బౌద్ధ సన్యాసి మహంత్​ వీర్​ చంద్రమణి.

YES9 TV