సోషల్ మీడియా వేదికగా పరకాల ప్రభాకర్ యుద్ధం ప్రకటించేశారు. అదీ, జనసేన పార్టీ మీద.! నేరుగానే.! ప్యాకేజీ.. అంటూ విమర్శల పర్వం షురూ చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్.!
అదేంటీ, జనసేన పార్టీ, బీజేపీకి మిత్రపక్షమే కదా.? అంటే, పరకాల ప్రభాకర్ రాజకీయం వేరేలా వుంటుంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పలుమార్లు ఓడిపోయిన పరకాల ప్రభాకర్, నిస్సిగ్గుగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల ఓటమి గురించి సెటైర్లేస్తుంటారు. ‘గురివింద’ నైజం.. అంటే, ఆ గురివింద కూడా సిగ్గుపడుతుంది పరకాల ప్రభాకర్ విషయంలో.
ఇంతకీ, పరకాల ప్రభాకర్ వెనకాల ఎవరున్నారు.? అంటే, స్ట్రెయిట్ ఆన్సర్ చంద్రబాబేనట.! ఈ తరహా రాజకీయాలు చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. నిజానికి, పరకాల ప్రభాకర్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్, కోవర్ట్.. అన్న విమర్శలున్నాయ్. ఆ లెక్కన, పరకాల ప్రభాకర్ కేవలం టీడీపీకి మాత్రమే ఎందుకు అమ్ముడుపోవాలి.? ఆయన్ని వైసీపీ కూడా ‘అద్దెకు తీసుకుని’ వుండొచ్చు కదా.?
ఏమో, తెరవెనుకాల ఏదైనా జరిగి వుండొచ్చు. రాష్ట్రంలో జనసేన పార్టీకి 18 నుంచి 25 శాతం వరకు ఓటు బ్యాంకు పెరిగినట్లు టీడీపీ, వైసీపీ అంతర్గత నివేదికల్లో తేలుతున్న దరిమిలా, జనసేనని దెబ్బతీసేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజల్ని కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టడానికి, ఈ తరహా ‘బేరగాళ్ళను’ దించడం మామూలేనన్నది రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోన్న అభిప్రాయం.
పరకాల ప్రభాకర్ మాత్రమేనా.? ఇంకెవరైనా రాబోతున్నారా.? అంటే, లేకనేం.. టీడీపీ, వైసీపీ ఇప్పటికే చాలామందిని ఎంగేజ్ చేశాయ్.. మరికొంతమందిని కూడా అదనంగా దించబోతున్నారట. టీడీపీ, వైసీపీ అను’కుల’ మీడియా సంస్థలకిక పండగే పండగ.! అయితే, ఇప్పుడున్నది జనసేన.. ఒకప్పటి ప్రజారాజ్యం కాదు.! మాటకు మాట.. వేరే స్థాయిలో వుంటుందన్నది జనసేన నేతలు తమ రాజకీయ ప్రత్యర్థులకు ఇస్తోన్న స్వీట్ వార్నింగ్.!
