రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అతిపెద్ద భారీ బడ్జెట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
ఇక ఆ తర్వాత సలార్ సినిమాతో రాబోతున్న ప్రభాస్ మొత్తానికి ప్రాజెక్ట్ K విషయంలో కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాడు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరపైకి రాబోతున్న ఈ సినిమాలు టైమ్ ట్రావెల్ నేపథ్యం కూడా హైలెట్ కాబోతోందట.
అయితే ప్రాజెక్ట్ K సినిమాను 2024 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి రెడీ అయ్యారు. అధికారికంగా శివరాత్రి రోజు ఒక పోస్టల్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ సినిమాలో కొంతమంది ప్రముఖ నటీనటులు ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే అమితాబ్ బచ్చన్ ప్రభాస్ గురువు పాత్రలో నటిస్తూ ఉండగా ఇప్పుడు మరొక యువ హీరో కూడా ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో కథను మలుపు తెప్పే పాత్రలో కనిపించబోతున్నాడట. దర్శకుడు నాగ్ అశ్విన్ ఇదివరకే మహానటి సినిమాలో జెమిని గణేషన్ పాత్రలో చూపించాడు.
అలాగే సీతారామం సినిమాతో దుల్కర్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ ప్రాజెక్ట్ K లో కూడా కనిపించబోతున్నాడు అనగానే ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం అతనికి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు వస్తున్నాయి. కానీ తొందరపడి ఏది పడితే అది చేయకూడదు అని మంచి కంటెంట్ ఉన్న సినిమాలతోనే మళ్లీ తెలుగు ఆడియోన్స్ ను ఆకట్టుకోవాలి అని చూస్తున్నాడు. మరి ప్రాజెక్ట్ k లో అతను ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో చూడాలి. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనే మేయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
