ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ కొత్త విజేతగా బెలారస్‌

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ కొత్త విజేతగా బెలారస్‌కు చెందిన అరినా సబలెంక అవతరించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌లో రిబకినా (కజకిస్థాన్‌)పై సబలెంక 4-6 6-3 6 -4 తేడాతో విజయాన్ని సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఐదో సీడ్ సబలెంకకు 22వ సీడ్ రిబకినా గట్టిపోటీనిచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను రిబాకినా 6-4తో సొంతం చేసుకున్నది. కానీ రెండో సెట్‌లో అనూహ్యంగా పుంజుకున్న సబలెంక ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వలేదు.

వరుస ఏస్‌లతో విరుచుకుపడింది. రెండు సెట్స్‌ను 6-3 6-4తో గెలుచుకొని టైటిల్ సొంతం చేసుకున్నది. సబలెంకకు ఇదే తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్. అంతేకాకుండా కెరీర్‌లో ఇదే ఫస్ట్ గ్రాండ్‌ప్లామ్‌ టైటిల్ కూడా కావడం గమనార్హం. రిబాకినా కూడా తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ చేరుకున్నది. కానీ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నది. ఈ మ్యాచ్‌లో సబలెంక 17 ఏస్‌లు సాధించగా రిబకినా 9 మాత్రమే సాధించింది. విన్నర్‌గా నిలిచిన సబలెంకకు 16.73 కోట్ల ప్రైజ్‌మనీ దక్కగా రిబకినాకు 9.14 కోట్లు దక్కాయి. గత ఏడాదితో పోలిస్తే ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్‌మనీ పెరగడం గమనార్హం.

YES9 TV