శనివారం శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమ్ ఇండియా 91 పరుగులతో విజయాన్ని సాధించింది. ఈ విజయంతో 2-1 తేడాతో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్నది. కాగా ఈ మ్యాచ్‌లో ఆరంభంలో నెమ్మదిగా బ్యాటింగ్ చేసి టీమ్ ఇండియా అభిమానులను భయపెట్టాడు ఓపెనర్ శుభ్‌మన్ గిల్. శ్రీలంక పేసర్ రజిత వేసిన రెండో ఓవర్‌ను శుభ్‌మన్ మెయిడిన్ చేశాడు. రజిత బౌలింగ్‌నుఎదుర్కొని సింగిల్ తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. తొమ్మిది బాల్స్ ఎదుర్కొని సింగిల్ రన్ కూడా తీయలేకపోయాడు శుభ్‌మన్ గిల్. పదో బాల్‌కు సిక్స్ కొట్టి పరుగులు ఖాతా తెరిచాడు. 36 బాల్స్‌లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో 46 రన్స్ చేసి ఔటయ్యాడు.
వన్డే మాదిరిగా శుభ్‌మన్ గిల్ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. టీ20ల్లో మెయిడిన్ ఓవర్ చేయడంతో గిల్‌ను నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. గతంలో ఇలాగే కె.ఎల్ రాహుల్ కూడా టీ20ల్లో ఓ మెయిడిన్ ఓవర్ ఆడాడు. ఇద్దరిని పోల్చుతూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కెఎల్ రాహుల్ జట్టు నుంచి దూరమైన మరో రాహుల్ వచ్చాడంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కె.ఎల్ రాహుల్ వారసుడు గిల్ అంటూ పేర్కొంటున్నారు. టీ20ని టెస్ట్ మ్యాచ్‌గా మార్చేశాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. టీ20లకు శుభ్‌మన్ పనికిరాడంటూ కొందరు పేర్కొన్నారు.ఈ ట్రోల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
