టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్‌కు ఇటీవల కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తన హోమ్ టౌన్ రూర్కికి వెళ్లి తిరిగి వస్తుండగా.. దిల్లీ-దెహ్రాదూన్ హైవైపే ఆతడికి డిసెంబరు 30న ప్రమాదం జరిగింది. దిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రి చికిత్స పొందుతున్న అతడిని బుధవారం నాడు ముంబయికి మార్చనున్నారు. మెరుగైన వైద్యం కోసం ముబంయికి తరలించనున్నట్లు దిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసొసియేషన్(DDCA) డైరెక్టర్ శ్యామ్ సుందర్ తెలిపారు. అతడు పూర్తిగా కోలుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుందని ఆయన అన్నారు. పంత్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. చికిత్సకు బాగా స్పందిస్తున్నాడు. అతడి ఎడమ కనుబొమ్మపై ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. కారు ప్రమాదంలో అక్కడ అతడికి తీవ్రంగా గాయమైంది.
కుడి మోకాలిలో లిగమెంట్ గాయం నుంచి కోలుకోడానికి ఇంకాస్త సమయం పడుతుంది. సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్సను అందిస్తున్నారు. అని ఆయన స్పష్టం చేశారు. పంత్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు. కారు ప్రమాదానికి గురి కావడంతో పంత్ చాలా కాలం పాటు ఆటకు దూరం కానున్నాడు. వచ్చే నెల 9 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్‌కు కూడా దూరమవనున్నాడు. అంతేకాకుండా ఐపీఎల్ 2023 సీజన్ మొత్తం దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఉన్న అతడు లేని లోటు పూడ్చడం కష్టమే. డిసెంబరు 30న తన హోమ్ టౌన్ రూర్కీకి వెళ్లి దిల్లీ-దెహ్రాదూన్ హైవై తిరిగొస్తున్న పంత్ కారు ప్రమాదానికి గురయ్యాడు. నుదురు, మోకాలు, ఎడమ కన్ను, మణికట్టు, మడమ వద్ద అతడికి తీవ్రంగా గాయాలయ్యాయి. పంత్ ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారు అదుపు తప్పి వేగంగా రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. తృటిలో ప్రాణాల నుంచి తప్పించుకున్ని క్రికెటర్‌ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
