- ఒక్క అవకాశం ఇవ్వండి.. పెద్దనెలటూరును అభివృద్ధికి చిరునామాగా మారుస్తా! : లోకేశ్వర రెడ్డి
- గ్రామ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. అభివృద్ధే మా సంకల్పం
గోనెగండ్ల: పెద్దనెలటూరు గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని వైసీపీ సీనియర్ నాయకుడు లోకేశ్వర రెడ్డి అన్నారు. తన భార్యను కనకవీటి శ్రీదేవమ్మ సర్పంచ్‌గా ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే గ్రామ రూపురేఖలు మార్చేలా అభివృద్ధి పనులు చేపడతామని భరోసా ఇచ్చారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. పదవి కోసం కాకుండా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వస్తున్నామని, గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తామని లోకేశ్వర రెడ్డి పేర్కొన్నారు.
