కదిరి నియోజకవర్గ ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తున్నాం!

—

సయ్యద్ సమీవుల్లా
రాష్ట్ర అధికార ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్

 

  • కదిరి నియోజకవర్గ ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తున్నాం!
  • కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు, క్రమశిక్షణపై అపోహలు సృష్టించవద్దు!
  • కదిరి నియోజకవర్గ ప్రజలకు మా విజ్ఞప్తి!

ఇటీవల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాలు, మున్సిపల్ ఎన్నికలు, పార్టీ బి-ఫారం కేటాయింపుల విషయంలో కొందరు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లో అపోహలు సృష్టించే విధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం మా బాధ్యతగా భావిస్తున్నాము.

మాజీ మంత్రి, CWC సభ్యులు గౌరవనీయులు శ్రీ ఎన్. రఘువీరారెడ్డి గారు గానీ, మాజీ రాజ్యసభ సభ్యులు, PCC రాష్ట్ర మీడియా చైర్మన్ గౌరవనీయులు శ్రీ ఎన్. తులసిరెడ్డి గారు గానీ, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరికీ ఎటువంటి హామీ ఇవ్వలేదు. అలాంటప్పుడు పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్లు, వారు తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు మాట్లాడటం సరైన పద్ధతి కాదు.

చిలమత్తూరు మోహన్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీలో కనీసం అభ్యర్థిత్వం కూడా లేదు. అలాంటప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం, ఒక క్రమశిక్షణ, ఒక నిర్ణయ ప్రక్రియ ఉంటాయి. పార్టీతో సంబంధం లేని వ్యక్తులు పార్టీ నాయకులుగా చెప్పుకోవడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమే అవుతుంది.

కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వారికి, పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకులు మరియు కార్యకర్తలకు ఎన్నికల్లో అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కె.ఎస్. షానవాజ్ గారు కృషి చేశారు.

కదిరి మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా పార్టీ విధానాలను అనుసరించడం జరిగింది. నామినేషన్ల దాఖలుకు 15 రోజుల ముందుగానే కదిరి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ అల్లాబక్ష్ గారి సతీమణి పేరును మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా APCC అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి వై.ఎస్. షర్మిలమ్మ గారికి ప్రతిపాదించడం జరిగింది.

షర్మిలమ్మ గారి అనుమతి పొందిన తరువాతే పార్టీ బి-ఫారం అందజేసి, వారికి అభ్యర్థిత్వం కల్పించడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ అనుసరించే ప్రజాస్వామ్య విధానం, పార్టీ క్రమశిక్షణకు నిదర్శనం.

మున్సిపల్ ఎన్నికల విషయంలో కూడా కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. 2024లో మున్సిపల్ ఎన్నికలు జరగలేదు. ఆ సమయంలో జరిగినవి శాసనసభ ఎన్నికలు. ఆ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీలు కూడా మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టలేదు.

మీరు ప్రస్తావిస్తున్న మున్సిపల్ ఎన్నికలు 2021లో జరిగాయి. ఆ ఎన్నికల్లో కదిరి కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రంలోనే అరుదైన రీతిలో 24 మంది కౌన్సిలర్ అభ్యర్థులను నిలబెట్టిన ఘనత మా DCC అధ్యక్షులు శ్రీ కె.ఎస్. షానవాజ్ గారిదే.

అంతేకాకుండా, ఇటీవల జరిగిన ZPTC ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 22 మంది అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది. తలుపుల మండలం నుంచి ZPTC సభ్యునిగా మా కుటుంబానికి కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది.

కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు, అవకాశాలు కల్పించడమే మా నాయకత్వం లక్ష్యం. పార్టీని బలోపేతం చేయడం, కార్యకర్తలకు అండగా నిలవడం, ప్రజల విశ్వాసాన్ని పొందడం మా ప్రాధాన్యత.

చిలమత్తూరు మోహన్ గాంధీ గారిని కొంతమంది పావుగా ఉపయోగించుకుని రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నాము. గాంధీ గారు ఈ విషయాన్ని గ్రహించి, వాస్తవాలను తెలుసుకుని మాట్లాడితే ఆయనకే మంచిది. సమాజంలో ఆయనకు ఉన్న గౌరవం, విలువ నిలబడతాయి.

కాంగ్రెస్ పార్టీ పేరును చెప్పుకుంటూ, మరోవైపు ఇతర పార్టీల కోసం పనిచేసే వారిని కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా ఉపేక్షించదు. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

గాంధీ గారు వాస్తవాలను తెలుసుకుని, నిజాయితీగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను.

ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి, ప్రజాసేవ చేయాలనే నిజమైన అభిలాష కలిగి ఉంటే, తప్పకుండా మా DCC అధ్యక్షులు శ్రీ కె.ఎస్. షానవాజ్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాము. ఆయనతో చర్చించి, గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కల్పించే ప్రయత్నం కూడా కచ్చితంగా చేస్తాను.

కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా నియమాలను ఉల్లంఘించి, పార్టీ నిర్ణయాలను ధిక్కరిస్తూ, పార్టీ పేరును అడ్డుపెట్టుకుని వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని ప్రయత్నించే వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

ఈ వ్యవహారాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, పార్టీ క్రమశిక్షణా కమిటీ దృష్టికి కూడా తీసుకెళ్తాము. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో చర్చించి, ఈ అంశంపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి, తగిన చర్యలు తీసుకునేలా పార్టీ అధిష్ఠానంతో మాట్లాడటం జరుగుతుంది.

కదిరి నియోజకవర్గ ప్రజలు వాస్తవాలను తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఐక్యతను, క్రమశిక్షణను, పార్టీ కోసం పనిచేసే నాయకులు మరియు కార్యకర్తల గౌరవాన్ని కాపాడటం మా బాధ్యత.

ఇట్లు,

సయ్యద్ సమీవుల్లా
రాష్ట్ర అధికార ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్

Posted Under AP
Editor