- పెద్దమర్రివీడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థిగా బోయ మల్లేష్ పోటీ చేస్తున్నారు
- ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ చైర్మన్, ఎంపీపీ సహకారంతో ఎన్నికల బరిలోకి బోయ మల్లేష్..!
- కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించండి.. టీడీపీ సర్పంచ్ అభ్యర్థి విజ్ఞప్తి.. పెద్ద మరివీడు గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు..
YES9 TV TELUGU – గోనెగండ్ల:
పెద్దమర్రివీడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థిగా బోయ మల్లేష్ పోటీ చేస్తున్నారు. ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ చైర్మన్, ఎంపీపీ సహకారంతో తాను ఎన్నికల బరిలో నిలిచినట్లు అభ్యర్థి బోయ మల్లేష్ తెలిపారు.
గ్రామ ప్రజల ఆశీస్సులు, నాయకుల సహకారంతో ఎన్నికల్లో విజయం సాధించాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. తనకు కేటాయించిన కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ ఓటర్లను కోరారు.
గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ప్రజల మద్దతుతో సర్పంచ్‌గా అవకాశం కల్పించాలని బోయ మల్లేష్ విజ్ఞప్తి చేశారు.
పోలింగ్ తేదీ: 29-11-2026 (ఆదివారం)
ఎన్నికల గుర్తు: కత్తెర
