టికెట్లు అమ్ముకున్నట్లు నిరూపిస్తే డీసీసీబీ, టీడీపీ ఇంచార్జ్ పదవులకు రాజీనామా చేస్తా

*టికెట్లు అమ్ముకొన్నట్లు నిరూపిస్తే డీసీసీబీ పదవికి, టీడీపి ఇంచార్జ్ పదవికి రాజీనామా చేస్తా…! – బద్వేల్ టీడీపి ఇంచార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి* .కడప జిల్లా, బద్వేల్ నవంబర్ 12: ఎంఎల్సీ గోవిందరెడ్డి చేసిన ఆరోపణలను బద్వేల్ నియోజకవర్గం టీడీపి ఇంచార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గురువారం బద్వేల్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తిప్పి కొట్టారు. నేను ఇప్పటికీ, ఎప్పటికే వీరారెడ్డి అభిమానినే అన్నారు. పార్టీ ఆదేశిస్తే విజయమ్మ, రితేస్ రెడ్డి క్రింద పనిచేస్తా అన్నారు. నేనుకాదు వెన్నుపోటుదారున్ని, మీరే అన్నారు. శివరామ కృష్ణారావు రాజశేఖర్ రెడ్డికి నిన్ను తీసుకెళ్లి పరిచయం చేస్తే నీవు ఎలా ఆయనకు వెన్నుపోటు పొడిచి, కుట్రలు, కుతంత్రాలు చేసి 25 యేండ్లు బద్వేల్ నియోజకవర్గాన్ని ఎలా పాలించావో అందరికీ తెలుసు అన్నారు. విద్యావంతుడివి, ఉన్నత ఉద్యోగం చేసిన వ్యక్తివి ఇలా దిగజారి ప్రవర్తించడం నీకు తగదు అన్నారు. రూపాయి ఖర్చు పెట్టకుండా నీవు చేసే నీచ, నికృష్టపు రాజకీయం వల్లనే నేడు నీకు ఈ పరిస్థితి దాపురించింది అన్నారు. బద్వేల్ మున్సిపాలిటీలో ఏ ఒక్క కౌన్సిలర్ తో అయినా నేను ముడుపులు తీసుకున్నట్లు, టికెట్లు అమ్ముకొన్నట్లు నిరూపిస్తే డీసీసీబి పదవికి, ఇంచార్జ్ పదవికి రాజీనామా చేస్తా అన్నారు. తెలుగు గంగ ఎడమ కాలువ,కుడి కాలువకు సంబంధించి షూ కంపెనీ వద్ద నీవు సొమ్ములు తీసుకోలేదా అని నిలదీశారు. ఉద్యోగం చేసి వచ్చావ్…బల్ల క్రింద చేతులు పెట్టే అలవాటు నీకుంటుందిగాని నాకు కాదు అని తీవ్ర విమర్శ చేశారు. నీ స్వంత మండలం అయిన కాశినాయనలో నీవు ఎందుకు పోటీ చేయలేదు, ఎందుకు గెలిపించుకోలేదు అని నిలదీశారు. నేను ముందే చెప్పానుకదా…నాలుగు జడ్పీటీసీలు గెలవపోతున్నాం అని. నేను టీడీపి ఇంచార్జ్ గా వచ్చి నాలుగు నెలలే అయింది, సీనియర్ నాయకులందరికీ పదవులు వచ్చేలా కష్టపడ్డాను, మరినీవు నీవద్దవున్న ఒక్క సీనియర్ నాయకుడికి అయినా పదవి ఇచ్చి గౌరవించావా అని ప్రశ్నించారు. పదవులు అమ్ముకొనే అలవాటు మీకు ఉందిగానీ, నాకు లేదు అని మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఎంఎల్సీ గోవింద రెడ్డిపై నిప్పులు చెరిగారు.

Editor