కర్నూలులో ‘కలానికి సంకెళ్లు’కర్నూలులో ‘కలానికి సంకెళ్లు’….

కర్నూలులో ‘కలానికి సంకెళ్ళ’పై భగ్గుమన్నాయి జర్నలిస్టు,ప్రజా,విద్యార్ధి,యువజన,ఎ న్డియేతర రాజకీయపక్షాలు.జర్నలిస్టుల అక్రమ అరెస్ట్ లను తీవ్రంగా ఖండించాయి. జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేసాయి.ఐ న్యూస్ టివి చానెల్ జర్నలిస్టులపై అక్రమ క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ జర్నలిస్టు సంఘాల జెఎసి ఆధ్వర్యంలో కర్నూలులో ‘కలానికి సంకెళ్ళా’ అంటూ చేతులకు సంకెళ్లు వేసుకొని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని జర్నలిస్టు సంఘాలు,ప్రజాసంఘాలు,బిసి సంఘాలు,వామపక్ష విద్యార్ధి సంఘాలు,సిపిఐ, సిపిఎం, సీఐటీయూ,ఇండియన్ లాయర్స్ అసోసియేషన్, బిసివై పార్టీ, కాంగ్రెస్, వైసీపీ పార్టీలు మద్దతు ఇచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి.ఐ న్యూస్ జర్నలిస్టులపై పెట్టిన అక్రమ క్రిమినల్ కేసులను ఎత్తివేయాలని ముక్తకంటంగా డిమాండ్ చేసాయి.జర్నలిస్టుల అరెస్ట్ ను తీవ్రంగా ఖండించాయి.
భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి జరుగుతోందని,.పత్రిక స్వాతంత్రానికి భంగం కలుగుతోందని అన్నారు..
తాము చెప్పిందే రాజ్యాంగం.. తాము అమలు చేసేదే రాజ్యాంగం అంటూ దాడిని చేస్తున్నాయని,ఆ దాడిలో భాగంగానే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఐ న్యూస్ జర్నలిస్టులను తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారని అన్నారు. నంద్యాలలో ఐన్యూస్ టివి జర్నలిస్టులు రాష్ట్ర మంత్రి పనితీరును మీడియా ద్వారా ప్రశ్నిస్తే.. వాటిని తట్టుకోలేని మంత్రి రాజ్యాంగ వ్యవస్థలకు అతీతంగా.. మీడియా ద్వారా ప్రశ్నించిన జర్నలిస్టులను జైల్లో ఎలా పెట్టిస్తారని అన్నారు.రాజ్యానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రశ్నిస్తే అందరికీ ఇదే గతి పడుతుందన్న మెసేజ్ ను మీడియాకు మంత్రి ఇచ్చాడని అన్నారు..కలానికి సంకెళ్లు వేస్తానని.. ప్రశ్నించే గొంతును అణచివేస్తానని చెప్పకనే చెప్పాడని,మరి మనం మన కలానికి సంకెళ్ళు వేసుకుందామా..?మన గొంతులు అరవకుండా నోరు మూసుకుందామా..?కలానికి సంకెళ్లను తెంచేద్దామని అన్నారు. వేయి గొంతుకులుగా అరుచి .. కలం సిరాతో నియంతృత్వ రాజకీయ పోకడలను తరిమి కొడదామని పిలుపుఇచ్చారు. కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల జెఎసి చైర్మన్
సత్యన్న,ఎపియుడబ్ల్యూజె నాయకులు ఇ ఎన్ రాజు,గోరంట్ల కొండప్ప, శ్రీనివాసుల గౌడు,నాగరాజు, ఎపిజెఎఫ్ ప్రసిడెంట్ రామక్రిష్ణ,ఎపిఎంఎఫ్ నాయకులు మద్దులేటి, ఏపిడబ్ల్యూజెఎఫ్ నాయకులు శివకుమార్, యుజెఎఫ్ నాయకులు సత్యం, విజయ్ కుమార్,
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
ఎస్వి మోహన్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ ప్రసిడెంట్ క్రాంతికుమార్ నాయుడు,
దళితసమాఖ్య కొమ్ముపాలెం శ్రీనివాస్,
సిపిఐ రామక్రిష్ణ రెడ్డి,
ఏఐఎస్ఎఫ్ శీను,
సిపిఎం రాధాకృష్ణ,
సీఐటీయూ నాగేష్,
డివైఎఫ్ఐ అబ్దుల్లా,
ఐలు అజాద్,బిసి సంఘం శేషఫణి, బిసివై పార్టీ కంది వరుణ్ కుమార్ యాదవ్,సీనియర్ జర్నలిస్టులు శ్రీనాథ్, వే టు న్యూస్ అవినాష్,వీడియో జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు

Posted Under AP
Editor