కర్నూలు జిల్లా
హలహర్వి మండలం
ఎక్సైజ్ సూపరింటెండెంట్‌పై వైన్ షాప్ నిర్వాహకుడి సంచలన ఆరోపణలు
గుళ్యం గ్రామానికి చెందిన వైన్ షాప్ నిర్వాహకుడు ఏ. శ్రీధర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ES) సుధీర్ బాబుపై తీవ్ర స్థాయిలో లంచం, వేధింపుల ఆరోపణలు చేస్తూ విలేకరుల సమావేశం (ప్రెస్ మీట్) నిర్వహించారు.
గుళ్యం సరిహద్దు (బోర్డర్) ప్రాంతంలో ఉన్న 84వ నంబర్ వైన్ షాప్ లైసెన్స్ హోల్డర్/నిర్వహకులుగా శ్రీధర్ కు లంచం డిమాండ్: వైన్ షాప్ 2 సంవత్సరాల కాలపరిమితి ముగియడంతో, రేన్యూవల్ ప్రక్రియ కోసం ఎస్. సుధీర్ బాబు నిర్వహించిన సమావేశంలో ప్రతి షాప్‌కు రూ. 50,000 చొప్పున లంచం డిమాండ్ చేశారని శ్రీధర్ ఆరోపించారు.
వ్యాపారంలో తీవ్ర నష్టాలు వస్తున్నాయని, క్వార్టర్లీ లైసెన్స్ ఫీజు చెల్లించడం కూడా భారంగా మారిందని, అందుకే షాప్ నిర్వహించలేనని చెప్పినందుకు తనను అందరి ముందూ అవమానించి బయటకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో కూడా కార్యాలయానికి వెళ్లినప్పుడు గంటసేపు తీవ్ర పదజాలంతో తిడుతూ ప్రవర్తించారని తెలిపారు.
అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వ్యాపారం సాగనివ్వనని, లేనిపోని కేసులు పెట్టి వేధిస్తానని సుధీర్ బాబు బెదిరించినట్లు పేర్కొన్నారు.
బోర్డర్ ప్రాంతంలో ఉన్న తమ షాప్‌నకు సకాలంలో స్టాక్ అందకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు.
ఎక్సైజ్ అధికారి సుధీర్ బాబు ప్రవర్తన మరియు లంచం డిమాండ్ చేయడంపై చట్టపరంగా కేసులు నమోదు చేయిస్తానని శ్రీధర్ స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, బాధితుడిగా తనకు తగిన న్యాయం చేయాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.
