ఫ్లైఓవర్‌పై అదుపుతప్పిన సఫారీ.. ఇన్నోవా, లారీని ఢీకొట్టిన వైనం..

ఫ్లైఓవర్‌పై అదుపుతప్పిన సఫారీ.. ఇన్నోవా, లారీని ఢీకొట్టిన వైనం
ముదిగుబ్బ, ప్రజాశక్తి: ముదిగుబ్బ మండలం మలకవేముల సమీపంలోని ఫ్లైఓవర్‌పై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధర్మవరం నుంచి కదిరి వైపు వెళ్తున్న KA 36 N 9559 సఫారీ కారు ముందుగా వెళ్తున్న AP 40 MH 4545 ఇన్నోవా కారును ఢీకొట్టింది. అనంతరం సఫారీ కారు డివైడర్‌ను దాటి, కదిరి నుంచి ముదిగుబ్బ వైపు వస్తున్న లారీని ఢీకొట్టింది.
సమాచారం అందుకున్న పట్నం పోలీస్‌ ఎస్‌ఐ ఎస్‌ఎండీ అర్షద్‌ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

Posted Under AP
Editor