- పార్టీలకు అతీతంగా ప్రజా సేవే లక్ష్యం సర్పంచ్ బరిలో బేతాళ బడేసా
- పదవి కోసం కాదు గ్రామ అభివృద్ధి కోసమే పోటీ
- గ్రామ సమస్యలపై పోరాటమే నా లక్ష్యం గెలిపిస్తే అభివృద్ధితో రుణం తీర్చుకుంటా
గోనెగండ్ల, నవంబర్ 24 (నేటి ప్రగతి న్యూస్):
గ్రామ అభివృద్ధే లక్ష్యంగా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గోనెగండ్ల గ్రామ సర్పంచ్ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా బేతాళ బడేసా అడుగుపెట్టారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆయన నామినేషన్ దాఖలు చేసి, తన పోటీ గ్రామ సేవ కోసమేనని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా గ్రామానికి సేవ చేయాలనే సంకల్పంతో అన్ని కులాల, వర్గాల పెద్దలతో చర్చించి, వారి అభ్యర్థన మేరకు సర్పంచ్‌గా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు తనకు ఒక్క అవకాశం కల్పిస్తే గోనెగండ్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు.గ్రామంలో తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, మౌలిక వసతుల వంటి సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచి పదవిని అలంకరించుకోవడం కాదని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
గోనెగండ్ల ప్రజలు తనకు మద్దతుగా నిలిచి, ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని బేతాళ బడేసా విజ్ఞప్తి చేశారు.
